*స్థిరాస్తి వ్యాపారులపై కాల్పులు..... ఒకరి మృతి!*
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కాల్పులు కలకలం రేపాయి.కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వాహనంలో ఉన్న స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి రాఘవేందర్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దుండగులు ఒక్కసారిగా తమపై కాల్పులు జరిపారని అంబర్‌పేటకు చెందిన రాఘవేందర్‌రెడ్డి తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఈ ఉదయం కర్ణంగూడకు వెళ్లే మార్గంలో స్థానికులు ఓ స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. కారుపై రక్తపు మరకలు ఉండటంతో దగ్గరికి వెళ్లి చూడగా అందులోని ఓ వ్యక్తి స్పృహలో లేకపోవడాన్ని గమనించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ బీఎన్‌రెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తి శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందినట్లు.. అతడి స్వగ్రామం అల్మాస్‌గూడగా గుర్తించారు.
బాధితుడిని పరీక్షించిన వైద్యులు అతడి ఛాతీ కింద భాగంలో బుల్లెట్ గాయమైందని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాహనం నంబర్ ఆధారంగా బాధితుడు అంబర్‌పేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారిగా గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. తొలుత స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు భావించారు కానీ కాల్పులు జరిగినట్లు తేలింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారంలో వీరికి ఏమైనా గొడవలున్నాయా? కాల్పులు జరపడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతుడు శ్రీనివాస్‌రెడ్డి, రఘు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పటేల్‌గూడలోని 22 ఎకరాల్లో శ్రీనివాస్‌రెడ్డి, రఘు, మట్టారెడ్డి వెంచర్ వేశారు. వెంచర్ విషయంలో ఈ ముగ్గురి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఐదు గంటలకు శ్రీనివాస్‌రెడ్డి, రఘు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వెంచర్ విషయంలో మాట్లాడదామని వీరిద్దరినీ మట్టారెడ్డి పిలిపించారంటూ బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. కాల్పులకు అతడే కారణమని వారు అనుమానిస్తున్నారు. దీంతో మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు
*link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment