Tuesday, February 22, 2022

విశ్వ‌న‌గ‌రంలో విశ్వ‌’జిత్తులు’

విశ్వ‌న‌గ‌రంలో విశ్వ‌’జిత్తులు’

Courtesy by : తొలివెలుగు మీడియా 

- మంత్రి పేరుతో క‌థంతా న‌డిపిస్తున్న ఐపీఎస్?
– నాలుగేళ్లయినా పూర్తిగాని డిప్యుటేష‌న్‌?
– ఒకే ఒర‌లో దొంగ-పోలీస్?
– డీటీఓపీ రూల్స్ అనేవి ప‌ట్ట‌వు!
– ప్ర‌జాప్ర‌తినిధికంటే ఫ‌వ‌ర్ ఫుల్!
– సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణకు డిమాండ్?

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఎన్నో అక్ర‌మాలు వెలుగుచూశాయి. నాయ‌కుల క‌బ్జాలు, కాంట్రాక్ట‌ర్ల మోసాలు, అధికారుల అవినీతి.. ఒక్కోసారి నేత‌లు, కాంట్రాక్ట‌ర్లు, అధికారులు కుమ్మ‌క్క‌యిన బాగోతాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన అధికారులు, నాయ‌కులు క‌లిసి పోయి క్విడ్ ప్రో కో పాల‌సీతో దోచుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొంత‌మంది ఐఏఎస్‌, ఐపీఎస్ లు అయితే గులాబీ గులాంగిరీకే అంకిత‌మ‌య్యారు. హైద‌రాబాద్ ని విశ్వ న‌గ‌రంగా చేస్తామ‌ని చెప్పింది గులాబీ పార్టీ. అయితే.. ఓ ఐపీఎస్ తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. మేయ‌ర్, క‌మిష‌న‌ర్ ని కాద‌ని మంత్రి క‌నుస‌న్న‌ల్లో స‌మాంత‌ర ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నారంటే వ్య‌వ‌స్థ‌ల‌ను ఏ విధంగా తుంగ‌లో తొక్కుతూ రోజురోజుకీ ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా మారుతున్నారో అర్థం చేసుకోండి. ఒక్క డిపార్ట్ మెంట్ కి అధికారిగా వ‌చ్చిన ఆయ‌న‌.. ఇప్పుడు ఏకంగా ఐదింటిని త‌న గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆయ‌న ఎవ‌రో కాదు విశ్వ‌జిత్ కంపాటి.

ఎవ‌రీ ఐపీఎస్ విశ్వ‌జిత్ కంపాటి?

2013 బ్యాచ్ కి చెందిన విశ్వ‌జిత్. ఎక్క‌డ డ్యూటీ చేసినా వివాద‌స్ప‌ద‌మే. 2016లో మేడారం జాత‌ర‌లో ములుగు ఏఎస్పీగా ఉన్నారు. ఐటీడీఏ డాక్ట‌ర్, జ‌ర్న‌లిస్ట్ పై దాడిచేసి నిర్బంధించినందుకు వార్త‌ల్లోకి ఎక్కారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం యాద‌గిరిని నిర్బంధించి ఖాకీ జులం ప్ర‌ద‌ర్శించారు.మీరు వైద్యులైతే ఏంటి..? జ‌ర్న‌లిస్టులు అయితే ఏంటి..? తోలు తీస్తా అంటూ వార్నింగులు ఇచ్చారు. అంబులెన్స్ డ్రైవ‌ర్ పై దాడికి సంబంధించి జ‌ర్న‌లిస్ట్ జోక్యం చేసుకుంటే.. నువ్వ‌యితే ఎంట్రా తోలు తీస్తా అంటూ వీర్ర‌విగిపోయారు. లాఠీతో వైద్యుడిని కొట్టడంతో డాక్ట‌ర్స్ అంతా నిర‌స‌న తెలిపారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. మేడారం డ్యూటీ నుంచి దూరంగా ఉంచేంత వ‌ర‌కు ధ‌ర్నా చేశారంటే అత‌ను ఎంత దురుసుగా ప్ర‌వ‌ర్తించారో అర్ధం చేసుకోవ‌చ్చు.ఆ త‌ర్వాత రాజ‌న్న‌ సిరిసిల్ల జిల్లాకు ఎస్పీగా వెళ్లారు. అక్క‌డ ఇసుక మాఫియా చెప్పిన‌ట్లు విని ద‌ళితులపై కేసులు బ‌నాయించార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎస్సీ క‌మిష‌న్ ముందు ఎస్పీని బ‌దిలీ చేయాలనే డిమాండ్లు వినిపించాయి. డీజీపీకి ఫిర్యాదులు వెల్లువ‌లా వ‌చ్చాయి. దీంతో మంత్రి కేటీఆర్ సొంత జిల్లా నుంచి.. త‌న మున్సిప‌ల్ శాఖలో కీల‌క‌మైన‌ గ్రేట‌ర్ హైద‌రాబాద్ కి విశ్వ‌జిత్ ని డిప్యుటేషన్ పై తీసుకొచ్చారు.

టీఆర్ఎస్ లో కంపాటి ప్ర‌కంప‌న‌లు?

2018లో జీహెచ్ఎంసీలో డైరెక్ట‌ర్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్, డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ డైరెక్ట‌ర్ గా విశ్వ‌జిత్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మ‌ద‌ర్ డిపార్ట్ మెంట్ నుంచి ఎక్క‌డికి డిప్యుటేష‌న్ పై వెళ్లినా.. డీఓపీటీ నిబంధ‌న‌ల ప్ర‌కారం మూడేళ్ల‌కంటే ఎక్కువ‌గా ఉండ‌రాదు. కానీ మంత్రి అండ‌దండ‌ల‌తో మూడేళ్లు దాటినా.. మ‌రిన్ని డిపార్ట్ మెంట్ల‌ను త‌న చేతిలోకి తీసుకుని మేయ‌ర్, క‌మిష‌న‌ర్ కంటే ఎక్కువ‌గా అధికారం చ‌లాయిస్తున్నార‌ని టీఆర్ఎస్ నేత‌లే వాపోతున్నారు. 2021లో కొత్త మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అన్ని డిపార్ట్ మెంట్ల‌లో వేలు పెడుతున్నార‌ని త‌న‌కు ఏ విష‌యం తెలియ‌కుండానే అన్ని ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ఆమె స‌న్నిహితుల ముందు ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం.

ఒకే ఓర‌లో దొంగ‌-పోలీస్

టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌జాప్ర‌తినిధి కంటే ఎక్కువ‌గా ఈ అధికారి ప‌నిచేయ‌డంతో మ‌రిన్ని శాఖ‌ల‌ను అంట‌గ‌ట్టింది ప్ర‌భుత్వం. ట్రాన్స్ ఫోర్ట్, అడ్వ‌టైజింగ్, మూసీ రివ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ తో పాటు స్ట్రాట‌జిక‌ల్ నాలా డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రాం డైరెక్ట‌ర్ గా మ‌రో నాలుగు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్పించింది. ఇక్క‌డ వాహ‌నాల‌కు టెండ‌ర్ వేసేది ఈ విశ్వ‌జిత్తే. ఆ త‌ర్వాత అక్ర‌మాలు జ‌రిగాయ‌ని తెలుసుకోవాలంటే విజిలెన్స్ చీఫ్ గా ఇదే ఐపీఎస్ అధికారి ఉండ‌టంతో పోలీస్ దొంగ‌ను ప‌ట్టుకుంటారు.. లేదా అత‌నే దొంగ అయితే పోలీస్ డ్యూటీ ఎలా చేస్తార‌ని విమ‌ర్శ‌లు తావిస్తున్నాయి. మూసీ రివ‌ర్ ఫండ్స్ లో అక్ర‌మాలు జ‌రిగితే ఎవ‌రు విచార‌ణ చేప‌ట్టాలి. నాలా విస్త‌ర‌ణ‌లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను ప‌సిగ‌ట్టే గుణం ఈ ఆరు డిపార్ట్ మెంట్ల డైరెక్ట‌ర్ కి ఉంటుందా? లేక.. క్లీనింగ్ లో భారీగా డ‌బ్బులు దుర్వినియోగం అయితే.. ఈయ‌న వెస్టేజ్ మెనెజ్ మెంట్ డైరెక్ట‌ర్ గా ఉన్నందున ఆ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్ట‌గ‌లుగుతారా? అనే అనుమానాలు తావిస్తున్నాయి. వీట‌న్నింటి బాధ్య‌త‌ల‌తో విజిలెన్స్ డ్యూటీ ఏలా చేస్తార‌ని హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

హోర్డింగుల‌తో హోరెత్తించారు

న‌గ‌రంలో అక్ర‌మ అడ్వ‌టైజింగ్ హోర్డింగులు ఉన్నాయ‌ని వాటిని తొల‌గించారు. అందుకు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా, గ‌ట్టి పునాదుల‌తో ప్రెస్ క్ల‌బ్ లో ఉండే హోర్డింగులు మొద‌లుకుని.. సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే పంజాగుట్ట స్మ‌శాన వాటిక‌లో ఉండే వాటిని సైతం పూర్తిగా తొల‌గించారు. వీట‌న్నింటిని తీసేసి.. కార్పొరేట్ సంస్థ‌ల‌కు దొచిపెట్టార‌నే అప‌వాదు ఉంది. మెట్రోతో పాటు మంత్రి క్లాస్ మేట్ కి ఉప‌యోగ‌ప‌డేలా అడ్వ‌టైజింగ్ బోర్డులకు ప్లానింగ్ చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఫైన్స్ తో భారీ ల‌బ్ది!

ఫ్లెక్సీల‌తో పొల్యూష‌న్ అవుతుంది. ఎక్క‌డా ఉండ‌వ‌ద్దు అంటూ నిబంధ‌న‌లు పెట్టారు. ఇంటికి టూ లెట్ అని రాస్తేనే వెయ్యి రూపాయ‌ల ఫైన్ విధిస్తున్నారు. ఇలా 2020 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 350 కోట్ల రూపాయ‌లు సామాన్యుల నుంచి ముక్కు పిండి వ‌సూలు చేశారు. క‌రోనా స‌మ‌యంలో కూడా ఫైన్ లు ఆగ‌లేదు. గోడ‌లపై పేర్లు రాసినా.. 5 వేల రుసుం చెల్లించాల్సిందే. ఇలా ప్ర‌త్యేక అకౌంట్ తీసి ఎన్ని డ‌బ్బులు వ‌సూలు చేశామో ట్రాఫిక్ పోలీసుల‌తో పోటీ ప‌డి మ‌రి లెక్క‌లు చూపిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ అకౌంట్ ఇల్లీగ‌ల్ అనే వాద‌న కూడా ఉంది. ఇక టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మయంలో ఆ పార్టీకి జీ హుజూర్ అయ్యారు. ఈవీడీఎం సిస్ట‌మ్ ని షట్ డౌన్ చేసి దుబాయ్ వెళ్లార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్లీన‌రీ స‌మయంలో న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా ఇష్టం వ‌చ్చిన‌ట్లు హోర్డింగ్స్, బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు, దండ‌లు క‌నిపించాయి.

విశ్వ‌జిత్‌ తీరుకే రిట‌న్ గిఫ్ట్ ఇచ్చారా?

రెండోసారి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఈస్ట్ అండ్ సౌత్ లో భారీగా సీట్ల‌ను కోల్పోయింది. విశ్వ‌జిత్‌ వ్య‌వ‌హారం, అధికారులు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం, వ‌ర‌దల స‌మ‌యంలో స‌రిగ్గా ప‌ని చేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అందుకే టీఆర్ఎస్ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు రిట‌న్ గిఫ్ట్‌ ఇచ్చార‌ని రాజ‌కీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

విశ్వ‌జిత్ అక్ర‌మాలు ఎలా బ‌య‌ట‌ప‌డాలి?

జీహెచ్ఎంసీలో జ‌రుగుతున్న అవినీతి, అక్ర‌మాలు ఎలా బ‌య‌ట‌ప‌డాలి. పాల‌న‌కు పార‌ద‌ర్శ‌క‌త ఉండాలంటే ఒక డిప్యుటేష‌న్ మీద వ‌చ్చిన అధికారికి అన్ని ముఖ్య‌మైన శాఖ‌లు అప్ప‌గించ‌డం.. అత్యంత కీల‌క‌మైన విజిలెన్స్ డైరెక్ట‌ర్ గా అత‌న్నే కొన‌సాగించ‌డంపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌న‌కు అనుకూలంగా ఉన్నవారికి మేలు చేసేలా టెండ‌ర్ల ప‌క్రియ ఉంటుంది. వాహ‌నాల కొనుగోళ్ల‌లో గోల్ మాల్ వ్య‌వ‌హారం, ఫైన్స్ విధించ‌డంలో వివ‌క్ష‌లు చూపించి దొచుకుంటున్నార‌నే మ‌ర‌క‌లు ఉన్నాయి. వీట‌న్నింటి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. హైకోర్టు రిటైర్డ్ జ‌డ్జితో లేదా యాక్టింగ్ జిల్లా జ‌డ్జితో విచార‌ణ చేప‌డితేనే తెలుస్తుందని జీహెచ్ఎంసీ గురించి తెలిసిన నాయ‌కులు, ఉద్యోగులు, పౌరులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment