Tuesday, February 15, 2022

'కులం' అనే పదంతో ఒక కవి రాసిన 'పదకేళి'.!!

*'కులం' అనే పదంతో ఒక కవి  రాసిన 'పదకేళి'..* 

బాల్యంలో బాలకులం
యవ్వనంలో యువకులం
వృద్ధాప్యంలో పండుటాకులం
రాలిపోయే ఎండుటాకులం..!

         ఎవరూ లేకుంటే ఏకాకులం
         ప్రేమలో ఉంటే ప్రేమికులం
         పెళ్ళైతే సంసారికులం
         కాకుంటే బ్రహ్మచారికులం

రక్షిస్తే రక్షకులం
భక్షిస్తే భక్షకులం 
దేశ సైనికులం
సమాజ సేవకులం

      ప్రయాణిస్తే ప్రయాణికులం
      నిత్య వాహన చోదకులం
      యాత్రలు చేస్తే యాత్రికులం
      మాయలు చేస్తే మాంత్రికులం

ఉపన్యసిస్తే ఉపన్యాసకులం
హాస్యం పండిస్తే విధూషకులం
పాడితే గాయకులం
సభలో ఉంటే సభికులం
సినిమా హాల్లొ ప్రేక్షకులం
టీవీ ల ముందు వీక్షకులం

      చదివింది గురుకులం 
      అభ్యసిస్తే అభ్యాసకులం 
      బోధిస్తే బోధకులం
      వృత్తిరీత్యా అధ్యాపకులం
      పత్రికల పాఠకులం
      నేర్పించే శిక్షకులం

కొందరితో ఉంటే సామాజీకులం
అందరితో ఉంటే అనేకులం
ఫలానోల్ల కుటుంభీకులం
ఆ వంశ సంబంధీకులం

మేం
        ధనముంటే దనికులం 
        లేకుంటే బీదకులం
        దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం
        నమ్మకుంటే నాస్తికులం
 
మేమే..
        నాగరికత నేర్పిన నాగరికులం
        జాతకాలు నమ్మే అమాయకులం
        మూఢత్వంపోని మూర్ఖులం..!

మేమే మేమే..
         సమానత్వ సాధకులం
         మతాలను గౌరవించే లౌకికులం
         ఎల్లలు లేని దేశ ప్రేమికులం..

మేమే..
          కష్టపడే కర్షకులం
          నిరంతర శ్రామికులం
          పరిశ్రమించే పారిశ్రామికులం
          కర్మాగారాల్లోని కార్మికులం
          నిజాలు చెప్తే వాస్తవికులం
          చెప్పకుంటే అపద్దీకులం

మేమవుతాం
           కొందరికి పూర్వీకులం
           మరికొందరికి సమకాలికులం
           ప్రస్తుత వర్తమానికులం
           కొందరికి స్ఫూర్తిదాయకులం 
           మరికొందరికి మార్గదర్శకులం

    మేం
          మార్పు కోరే పరివర్తకులం
          వినూత్న ఔత్సాహికులం
          కొత్త కొత్త ప్రయోగకులం 
          సరికొత్త ఆవిష్కర్తకులం
          వ్యాపారాలు చేసే వర్తకులం
          సంస్థల,సంఘాల వ్యవస్థాపకులం

మేం
         పరిపాలిస్తే పాలకులం
         పాలించబడితే ఎలీకులం
         వంచిస్తే వంఛకులం
         పంచుకుంటే భాగస్వామికులం

మొత్తానికి
           బాల్యంలో చిగురుటాకులం
           కుర్రతనంలో బాకులం
           యవ్వనంలో చాకులం
           మధ్య వయస్సులో మేకులం
           చరమాంకంలో రేకులం
           రాలిపోయే ఆకులం 

విదేశాల్లో మేము ఒకే దేశకులం
పక్క రాష్ట్రాల్లో మేము ఒకే ప్రాంతీకులం
పరబాషల వారికాడ ఒకే భాషకులం
ఒకే భాష వారికాడ ఫలానా యాసకులం
మొత్తానికి అవుతాం ఈ దేశంలో ఏదో ఒకకులం
 
నిత్యం కులం పేరుతో తిట్టుకుంటాం,
కొట్టుకుంటాం , కానీ బేధాలెన్ని ఉన్నా,
నిలబెట్టుకుంటాం మా దేశాన్ని ,
 ఎందుకంటే ........ !
      
             మేమే భరత జాతి వంశీకులం..
            
       భావి భారత రథసారథికులం...
రచయిత ఎవరో కానీ చాలా అద్భుతంగా రాసారు వారికి వారి భావుకతకు 🙏🙏🙏

No comments:

Post a Comment