Tuesday, February 1, 2022

తెలంగాణలో జర్నలిస్టులకు రక్షణ కరువు

Courtesy by : Q News

తెలంగాణలో జర్నలిస్టులకు రక్షణ కరువు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు అవినీతి అక్రమాలపై వాస్తవాలు రాసే పరిస్థితి లేకుండా పోయిందని తెలంగాణ జర్నలిస్టుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న అనేకమంది జర్నలిస్టులపై టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులపై ఇలాంటి వేధింపులు, దాడులు దూషణలు లేవని జర్నలిస్ట్ సంఘాల నేతలు హితవు పలికారు. హయత్ నగర్ మహిళ ఎమ్మార్వో జర్నలిస్టును అసభ్య పదజాలంతో దూషించడాన్ని తెలంగాణలోని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కోన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు జర్నలిస్టులను దూషించినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించి ఉంటే రాష్ట్రంలో నేడు పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేదికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్ నిర్లక్ష్యంతోనే అధికారులు కూడా జర్నలిస్టులను దూషించే పరిస్థితి ఏర్పడడం అత్యంత బాధాకరమని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజా ప్రతినిధులు, అధికారులు అవినీతి అక్రమాలు భారీ ఎత్తున తీవ్రస్థాయిలో పెరిగాయన్నారు. లంచాలు ఇస్తే తప్ప ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు న్యాయం జరగడం లేదన్నారు. అధికారులు తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతుంటే సంబంధిత మంత్రులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జర్నలిస్ట్ సంఘాల నేతలు ప్రశ్నించారు. జర్నలిస్టులు వాస్తవాలను వెలుగులోకి తెస్తే.. వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులలో అవినీతిని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించి హయత్ నగర్ ఎమ్మార్వోను వెంటనే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరంతో పాటు పలు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని పలువురు జర్నలిస్టులు హెచ్చరించారు.

No comments:

Post a Comment