Saturday, February 5, 2022

టీమిండియా కుర్రాళ్లు కుమ్మేశారు. 2022 అండర్‌ 19వరల్డ్‌(Under 19 world cup) కప్‌ని గెలుచుకున్నారు

*టీమిండియా కుర్రాళ్లు కుమ్మేశారు. 2022 అండర్‌ 19వరల్డ్‌(Under 19 world cup) కప్‌ని గెలుచుకున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో మన జూనియర్స్ తగ్గేదేలా అంటూ ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల(4 Wickets)తేడాతో గెలిచి సత్తా చాటుకున్నారు.*.                                              
ఇంగ్లాండ్‌ (England)ఇచ్చిన 190 టార్గెట్‌ స్కోర్‌ని కేవలం 6వికెట్ల నష్టానికి 47.4 ఓవర్లలో 195 పరుగులు చేసి తమకు ఎదురులేదని చాటి చెప్పారు అండర్‌-19 టీమిండియా జట్టు. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫస్ట్ బ్యాటింగ్‌ తీసుకొని పూర్తి ఓవర్ల వరకూ ఆడలేకపోయారు జట్టులోని ఆటగాళ్లు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లకు భారత బౌలర్లు టెక్నిక్‌గా బౌలింగ్ వేసి కట్టడి చేయడంతో 189పరుగులకే 44.5 ఓవర్ల దగ్గర ఆలౌట్ అయ్యారు.నార్త్ సౌండ్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం(Vivian Richards Stadium)లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అండర్‌-19జట్టులోని పేసర్లు రాజ్‌బవా(Raj Bawa)5వికెట్లు తీసి 9.5ఓవర్లలో 31పరుగులు మాత్రమే ఇచ్చాడు, రవికుమార్‌(Ravi Kumar)4వికెట్లు తీసి 9ఓవర్లలో 34పరుగులు ఇచ్చాడు. ఇద్దరు పేసర్లు కలిసి ఇంగ్లండ్‌ ఆటగాళ్ల నడ్డి విరిచారు. ఐదు వికెట్లు తీసిన రాజ్‌ బవా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అండర్‌ -19వరల్డ్‌ కప్‌ టోర్నీలో తొలిసారిగా ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు రాజ్‌ బవా. 2006 అండర్‌ 19 వరల్డ్ కప్‌ ఫైనల్‌లో పాకిస్తాన్‌ బౌలర్ అన్వర్ అలీ ఫస్ట్ టైమ్ 5వికెట్లు తీసి రికార్డు నెలకోల్పాడు. ఆ తర్వాత రాజ్‌బవా నిలిచాడు. భారత యువ బ్యాట్స్‌మెన్లలో నిశాంత్‌ సింధు (Nishant Sindhu)హాఫ్‌ సెంచరీ చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు.

బౌలింగ్‌లో చుక్కలు చూపించారు..
ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు భారత్‌ బౌలర్లను మొదటి నుంచి ఎదుర్కొలేకపోయారు. రాజ్‌బవా, రవికుమార్‌ బౌలింగ్‌లో 61పరుగులకే 6వికెట్లు నష్టపోయింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లలో జార్జ్‌ థామస్ 27 పరుగులు చేశాడు మిగిలిన ఆటగాళ్లు ఎవరూ పది రన్నులకు మించి చేయలేకపోయారు.
 
ఈ టోర్నీలో ఇప్పటిదాకా అద్బుతంగా రాణించిన భారత కుర్ర స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో తేలిపోయారు. గతంలో నాలుగు సార్లు అండర్‌-19 వరల్డ్‌ కప్‌ సాధించింది భారత్. 2000, 2008, 2012, 2018లో వరల్డ్‌ కప్‌లు గెలిచారు. ఇప్పుడు మరోసారి గెలిచి ఐదో వరల్డ్‌కప్‌ని ఇండియాకు సాధించిపెట్టారు యువ ఆటగాళ్లు.

link Media ప్రజల పక్షం 

No comments:

Post a Comment