Saturday, February 19, 2022

మార్చి 4 వరకు సెలవులో డీజీపీ మహేందర్ రెడ్డి..అప్పటి వరకూ ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్​ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు

*Q న్యూస్*
*ప్రశ్నించే గొంతుక*

మార్చి 4 వరకు సెలవులో డీజీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆరోగ్య కారణాల రీత్యా ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు రెండు వారాల పాటు సెలవు పెట్టారు. అప్పటి వరకూ ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్​ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే, అంజనీకుమార్​ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆయన వచ్చేవరకు పూర్తి అదనపు బాధ్యతలను అంజనీకుమార్ చేపట్టనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
డీజీపీ సెలవు.. కారణం అదేనా?...
ఒకవైపు పోరుగు రాష్ట్రం ఏపీలో సైతం డీజీపీని అనూహ్యంగా మార్చటం.. ఈ సమయంలోనే.. డీజీపీ మహేందర్ రెడ్డి సెలవుపై వెళ్లటంతో.. కారణం ఏమిటి? అసలేం జరిగింది? అన్న అంశంపై ఆరా తీస్తే.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. మొన్న గురువారం రాత్రి ఆయన తన ఇంట్లోని బాత్రూంలో జారి పడినట్లుగా విశ్వాసనీయ సమాచారం. దీంతో ఆయన ఎడమ చేయికి గాయమైందని.. డాక్లర్లు కొద్ది రోజులు ఆయన్ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారని.. అందుకే, ఆయన ఓ పదిహేను రోజుల పాటు మెడికల్ లీవు తీసుకున్నారని పోలీసుల వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అప్పటివరకు
ఆయన స్థానంలో డీజీపీగా అంజనీ కుమార్ కు పూర్తి బాధ్యతల్ని అప్పగిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 

No comments:

Post a Comment