Wednesday, February 2, 2022

6 నెల్లు ముందుగానే**పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ అధినేత యోచన?

*6 నెల్లు ముందుగానే*

*పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ అధినేత యోచన?*

ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్న సీఎం కేసీఆర్‌

*30 వరకు నియోజకవర్గాల్లో కొత్తవారు లేదా యువతకు చాన్స్‌!*

*పార్టీ జిల్లా అధ్యక్షులకు సమన్వయం, సంస్థాగత శిక్షణ బాధ్యతలు*

*జాతీయ రాజకీయాలు సైతం లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కార్యాచరణ*

హైదరాబాద్‌: శాసనసభకు ముందస్తు ఎన్ని కలు ఉండబోవని కుండబద్దలు కొట్టిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వ్యూహా నికి మాత్రం ఇప్పటినుంచే పదును పెడుతున్నా రు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను 6 నెలల ముందే ప్రకటించా లని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వరుసగా రెండుసార్లు అసెం బ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.

ముందస్తు వ్యూహంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొం దడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత, అధికార పార్టీలో అసమ్మతి తమకు కలిసి వస్తుందనే విపక్షాల ఆశలను వమ్ము చేయాలనే పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నారు. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్‌ ఎస్‌కు ప్రస్తుతం 103 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలను గెలుస్తామని రెండ్రోజుల క్రితం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం
*కొత్త ముఖాలకు ప్రాధాన్యత?*
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించిన కేసీఆర్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 నుంచి 30 మంది కొత్తవారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్యేల వారసు లతో పాటు కొన్ని కొత్త ముఖాలకు ప్రత్యేకించి యువతకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం దక్కించుకున్న ఎర్రోల్ల శ్రీనివాస్, మన్నె క్రిషాంక్‌ వంటి కొందరు యువనేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ముగ్గురు ముఖ్య నేతలు తమ వారసులతో రాజకీయ ఆరంగేట్రం చేయించాలని భావిస్తున్నారు.

*link Media ప్రజల పక్షం🖋️*

prajasankalpam1.blogspot.com 

No comments:

Post a Comment