Tuesday, February 22, 2022

యాప్ లు, చానళ్లు, వెబ్సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం – దేశసమగ్రతను దెబ్బతీసే ప్రచారమే

SJF కు చెందిన యాప్ లు, చానళ్లు, వెబ్సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం – దేశసమగ్రతను దెబ్బతీసే ప్రచారమే కారణం

నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ SFJ తో అనుసంధానించి ఉన్న యాప్ లు, చానళ్లు, వెబ్ సైట్లను కేంద్రం బ్లాక్ చేసింది. పంజాబ్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పబ్లిక్ ఆర్డర్ కు భంగం కలిగించేలా డిజిటల్ మీడియాను ఉపయోగించేందుకు ప్రయత్నించారని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎన్నికల వేళ ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా… మతసామరస్యాన్ని దెబ్బతీసేలా, వేర్పాటు వాదాన్ని ప్రేరేపించేలా డిజిటల్ ప్లాట్ ఫాంలలో కంటెంట్ షేర్ చేశారని పేర్కొంది.భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, పబ్లిక్ ఆర్డర్ కు హానికరంగా వారి చర్యలు ఉన్నాయంది.

చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం, 1967 ప్రకారం వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్న సిఖ్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపక నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూను UAPA కింద తీవ్రవాదిగా ప్రకటించారు.
అయితే వేర్పాటు వాద సంస్థలు, నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా…ఇలాంటి వారి పట్ల భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని… దేశంలోని సమాచారాన్ని భద్రంగా ఉంచేలా…దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను దెబ్బతీసే చర్యలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది.

అటు కేజ్రీవాల్ ఒకప్పటి సన్నిహితుడు కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణల్ని కేంద్రం సీరియస్ గానే తీసుకుంది. పంజాబ్ కు సీఎం ను అవుతాను, లేదంటే స్వతంత్ర ఖలిస్తాన్ దేశానికి పీఎంనైనా అవుతానని కేజ్రీ తనతో చాలాసార్లు అన్నాడని కుమార్ విశ్వాస్ చెప్పిన విషయం తెలిసిందే. రాజకీయ వ్యక్తులు కొందరు వేర్పాటు వాద శక్తులతో కలిసి దేశ సమగ్రతను పణంగా పెడుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment