కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు – భవిష్యత్తులో కార్యకర్తలే ఉండరు – వైరల్ అవుతున్న దిగ్విజయ్ వ్యాఖ్యలు
Courtesy by : MyIndMedia తెలుగు ట్విట్టర్
‘కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు, ఆ పార్టీ తిరిగి పుంజుకోదు’ ఈ మాటలన్నది ఏ బీజేపీ నాయకుడో, మరే ఇతర పార్టీ వాళ్లో కాదు..కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన అన్నమాటలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో పార్టీకి కార్యకర్తలు దొరకని పరిస్థితి అని.. ఇలా ఎవరికివారుగా పనిచేస్తే ఎలా అని నిరాశతో అన్న మాటల్ని అక్కడే ఉన్న మీడియా వ్యక్తులెవరో రికార్డు చేశారు.
శనివారం రత్లాంలోని స్థానిక సర్క్యూట్ హౌస్లో జవరా కాంగ్రెస్ నేతలతో ఆయన ప్రైవేటుగా సమావేశమయ్యారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. గ్రూపులు కట్టవద్దని ఐక్యంగా కలిసి పనిచేస్తే విజయం సాధించగలమని చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందరూ సంఘటితంగా లేకుంటే భవిష్యత్తులో పార్టీకి కార్యకర్తలే దొరకరని అన్నారు. ఇవే చివరి ఎన్నికలు..మీరు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతే ..ఇళ్లల్లో కూర్చోండి. కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోదు. మనకు కార్యకర్తలు దొరకరు అని ఆయన అన్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2023లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే గ్రూపు తగాదాలు అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. సుదీర్ఘకాలం తరువాత అధికారం చిక్కి కొంతకాలానికే దూరమైంది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడంతో ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వం కేవలం 15 నెలలు మాత్రమే ఉండగలిగింది.ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నిరాశానిస్పృహలు ఆవహించాయి. ఇక తాజాగా దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు శ్రేణుల్ని మరింత నైరాశ్యంలోకి నెట్టేలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది పార్టీలోనే.
తాను కార్యకర్తలతో అన్న మాటల్ని మీడియా ప్రతినిధులు రికార్డ్ చేయడంపై డిగ్గీరాజా మండిపడ్డాడు.
No comments:
Post a Comment