Thursday, February 17, 2022

ఎన్.టి.ఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, శ్రీమతి నారా భువనేశ్వరి పత్రిక ప్రకటన

*హైదరాబాద్*

_*ఎన్.టి.ఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, శ్రీమతి నారా భువనేశ్వరి పత్రిక ప్రకటన వివరాలు..*_

*ప్రతిభ గల ఇంటర్ సెకండియర్ మరియూ CBSC -2 విద్యార్థినులకు ఎన్.టి.ఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ NTR GEST (Girls' Education Scholarship Test for Degree Courses) - 2022*

★ ఎన్.టి.ఆర్ విద్యాసంస్థలు డిగ్రీ విద్యార్థినులకు ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం మార్చి 20-03-2022 న NTR GET నిర్వహించనున్నట్లు ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు తెలియచేశారు. 

★ ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్.టి.ఆర్ విద్యాసంస్థల ద్వారా రూ.34 లక్షల వరకు ఉపకారవేతనం అందజేయబడుతుంది. 

★ ఈ క్రమంలో మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 5 వేల రూపాయల చొప్పున, తరువాతి 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 3 వేల రూపాయల చొప్పున ఎన్.టి.ఆర్ బాలికల డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసే వరకు ఇవ్వబడును. 

★ ఈ సదవకాశాన్ని ఇంటర్ సెకండియర్ మరియు CBSC 12వ తరగతి చదువుతున్న బాలికలందరూ వినియోగించుకోవలసినదిగా తెలియజేయడమైనది.

★ ఆసక్తి గల విద్యార్థినులు వెబ్ సైట్ www.ntrtrust.org లో 17.02.2022 నుండి 15.03.2022 వరకు నమోదు చేసుకోవొచ్చును.

★ ఇతర వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించగలరు.

*మొబైల్ నెంబర్:* *7660002627/28*

No comments:

Post a Comment