*ప్రముఖ సంగీత దర్శకుడు..... బప్పి లహరి కన్నుమూత!*
ముంబై: ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహిరి కన్నుమూశారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.ఆయన వయసు 69 ఏళ్లు. 1952 నవంబర్ 27న బెంగాల్‌లో జన్మించిన బప్పి.. తెలుగులో సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో చివరిగా డిస్కో రాజా చిత్రంలో పాటపాడారు. కాగా 2014లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు.
బప్పి ఎప్పుడూ ఒంటినిండ బంగారంతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించేవారు. మిథున్ చక్రవర్తికి డిస్కో డ్యాన్సర్ పాటతో లైఫ్ ఇచ్చిన బప్పి లహరి.. డిస్కో కింగ్‌గా గుర్తింపు పొందారు. డిస్కో పాటలతో 80,90 దశకాల్లో బాలీవుడ్‌ను ఏలారు. లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్‌కు బప్పిదా బంధువు. హిందీతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ భాషల్లో బప్పి లహిరి సంగీతం అందించారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment