Saturday, February 5, 2022

లతా మంగేష్కర్ ఇక లేరు.. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన గాయని

లతా మంగేష్కర్ ఇక లేరు.. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన గాయని

Courtesy by : BBC తెలుగు మీడియా ట్విట్టర్ 
లతా మంగేష్కర్

లతా మంగేష్కర్. ఆమె పాట వినని భారతీయులు ఉండరు. ఆమె భారత జాతీయ సంపద. భారతీయ సంస్కృతికి ఒక ప్రతీక. సినీ సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణి. ఎనిమిది దశాబ్దాల పాటు కొన్ని తరాలను తన గాన మాధుర్యంలో ఓలలాడించారు. అతి తక్కువే అయినా కొన్ని సినిమాల్లో నటించారు కూడా.

‘నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్’ అని పిలుచుకునే లతా మంగేష్కర్.. 36 భాషల్లో దాదాపు 30 వేల పాటలు పాడారు. ఆమె పాటల రికార్డులు లక్షల్లో అమ్ముడయ్యాయి.

బాలీవుడ్ గాయనిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన లతాకు.. క్రికెట్ అన్నా, కార్లు అన్నా చాలా ఇష్టం. వేగాస్‌ కేసినోల్లో సరదాగా జూదమాడటమూ ఆమెకు ఇష్టమే.

సినిమా పాటల్లో అనేక భావోద్వేగాలను పలికించే లతా మంగేష్కర్, జీవితంలోనూ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.

లతా మంగేష్కర్

ఎన్నడూ బడికి వెళ్లలేదు...

1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో జన్మించారు లతా మంగేష్కర్. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ హిందుస్తానీ సంగీతంలో దిట్ట. మరాఠీ రంగస్థల నటుడు కూడా. ఐదుగురు పిల్లల్లో ఆమే పెద్దది. ఆమె ఎప్పుడూ బడికి వెళ్లి చదువుకోలేదు. తమ ఇంట్లో పని మనిషి ఆమెకు మరాఠీ అక్షరమాల నేర్పించారు. స్థానిక పూజారి ఒకరు ఆమెకు సంస్కృతం నేర్పారు. బంధువులు, ట్యూషన్లు చెప్పే గురువులు ఇతర పాఠ్యాంశాలు బోధించారు.

లతా మంగేష్కర్‌కు తొలి సంగీత గురువు ఆమె తండ్రే. దీనానాథ్ శిష్యులకు సంగీతం నేర్పుతూ ఉంటే గమనిస్తూ ఉండేది చిన్నారి లత. ఒకసారి శిష్యులు తప్పుగా ఆలపిస్తున్న రాగాన్ని తాను సరి చేస్తుండగా తన తండ్రి గమనించారని లతా మంగేష్కర్ చెప్పే వారు.

అప్పుడే లతలోని సంగీత ప్రతిభను ఆయన గుర్తించారు. తొమ్మిదేళ్ల వయసులో తొలిసారి తండ్రితో కలిసి ప్రదర్శన ఇచ్చారు లతా మంగేష్కర్.

అయితే ఆమె తండ్రి ఆర్థికంగా దెబ్బతిని, తన నాటకాల కంపెనీని మూసేయటంతో కష్టాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలోని సాంగ్లీలో వారి ఇంటిని వేలం వేయటంతో.. కుటుంబం పూనా (ఇప్పుడు పుణె) నగరానికి నివాసం మారింది.

లతా మంగేష్కర్

ఇష్టం లేని ‘నటన’...

లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 1942లో మరణించారు. అప్పటికి లతా మంగేష్కర్ వయసు 13 ఏళ్లు. పెద్ద కుటుంబం. తీవ్రమైన ఆర్థిక కష్టాలు. లతా మంగేష్కర్‌కు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. పెద్ద కూతురుగా తల్లికి అండగా నిలుస్తూ కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత తీసుకున్నారు లతా మంగేష్కర్.

వారి కుటుంబం బొంబాయి (ఇప్పుడు ముంబై) నగరానికి వలసొచ్చింది. లత సంగీతం నేర్చుకుంటూనే మరొక వైపు సినిమాల్లో పాటలు పాడే అవకాశాల కోసం ప్రయత్నించారు.

అయితే.. 1940వ దశకం తొలి నాళ్లలో పాటలు ఎక్కువగా ఉండేవి కాదు. దీంతో సినిమాల్లో చిన్నచిన్న వేషాల్లో నటించటం మొదలు పెట్టారు.

కానీ సినిమాల్లో నటించడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఆమె మనసంతా పాట మీదనే ఉండేది. ఎనిమిది మరాఠీ, హిందీ సినిమాల్లో నటించారు.

---------------

https://twitter.com/bbcnewstelugu/status/1490181246340714497?t=j8JjvsvRs2M-HJUjoIDl1w&s=08

No comments:

Post a Comment