మా ప్లాట్లు ఎక్కడ..? మాకు న్యాయం చేయండి సారు..!
పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే.. పదేళ్లు గడుస్తున్నా పొజీషన్ చూపడం లేదని రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ముట్టడించారు బాధితులు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు.
వివరాల్లోకి వెళ్తే.. భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయం వెనుక బాగాన ఉన్న స్థలంలో.. ఫారెన్ సిటీ పేరిట 2007లో ఓ వెంచర్ ఏర్పాటైంది. అమీస్తా పూర్ గ్రామ పరిదిలోని 465, 467, 468, 469, 476, 478, 479 సర్వే నంబర్లలో 150 చదరపు గజాల చొప్పున.. దాదాపు ఆరు వందల పై చిలుకు ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయించారు రియల్టర్లు.
ఆ ప్లాట్ల విక్రయించి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. తమకు స్థలాలను చూపించ లేదని ఆరోపిస్తున్నారు. తమ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూపించాలని మహబూబ్ నగర్ పట్టణంలోని సాయిబిల్డర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ప్రస్తుతం స్థలం వివాదంలో ఉందని.. అక్కడ కాకుండా మరోచోట 100 గజాల చొప్పున ఇస్తానని రియల్ ఎస్టేట్ వ్యాపారి, భూత్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్ హామి ఇచ్చారు. అయినప్పటికీ.. లబ్దిదారులు వారిపై నమ్మకం లేదని వాపోతున్నారు. గతంలోనూ పలు మార్లు హీమీలు ఇచ్చి విస్మరించారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు
No comments:
Post a Comment