20 ఏళ్ళ నుండి వ్లాదిమిర్ పుతిన్ కంటున్న కల!
శక్తివంతమయిన రష్యా కోసం తపన పడ్డాడు వ్లాదిమిర్ పుతిన్!తన కలని వాస్తవరూపంలోకి తీసుకురావడానికి చాల కష్ట పడ్డాడు! అమెరికా,యూరోపు దేశాలు ఆంక్షలు విధించినా సహనంతో తగిన సమయం కోసం వేచి చూశాడు. ఆ సమయం రానే వచ్చింది జో బిడెన్,కమలా హారిస్ రూపంలో !
24-02-2022 గురువారం ఉదయం 6 గంటలకి రష్యా ప్రజలని ఉద్దేశించి టెలివిజన్ లో సుదీర్ఘంగా మాట్లాడాడు. తనకి తన రష్యా ప్రజల సంక్షేమమే ముఖ్యమని దానికోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. 6.30 లకి తన సైన్యానికి పిలుపు ఇచ్చాడు ఉక్రెయిన్ మీద దాడి చేయమని. మరో వైపు ఇతర దేశాలకి తీవ్ర హెచ్చరిక చేశాడు : మా విషయంలో ఏ దేశమన్నా కలుగచేసుకుంటే మాత్రం ఇప్పటివరకు మీరు ఊహించని పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ! పరోక్షంగా అణు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చేసిన హెచ్చరిక అది!
అమెరికా కి మరియు యూరోపియన్ యూనియన్ కి తెలుసు పుతిన్ ఎలాంటి వాడో ! ప్రత్యక్షంగా కనుక ఉక్రెయిన్ రష్యా ల మధ్య దూరి కలుగచేసుకుంటే కలిగే తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు కాబట్టి కేవలం ఆయుధాలు ఇచ్చి ఉక్రెయిన్ కి సహకరిస్తామని మాత్రమె అనగలగాయి. యాంటీ టాంక్ గైడెడ్ మిసైల్స్ [జావేలిన్ ?] తో పాటు మాన్ పోర్టబుల్ యాంటి ఎయిర్ మిసైల్స్ ని ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇచ్చింది అమెరికా ఉక్రెయిన్ కి. కానీ ప్రపంచమ్ లోనే అతి పెద్ద రెండవ సైన్యం కలిగి ఉన్న రష్యాని ఎదుర్కోవడానికి ఇవేవీ చాలవు. ఈ విషయం అటు అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలకీ తెలుసు.
ఇక యుద్ధంలో రష్యా ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయింది ? ఎన్ని యుద్ధ టాంకులు నష్టపోయింది లాంటి వివరాలు ఇప్పటికిప్పుడే నిజ వార్తలు తెలియవు. అక్కడ నుండి రిపోర్ట్ చేసే పశ్చిమ దేశాల మీడియాలు చెప్పేవన్నీ 60% పైగా అబద్ధాలే ఉంటాయి. యుద్ధం ముగిశాక మాత్రమె అసలు నిజాలు వాటి సంఖ్యలు తెలుస్తాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ వార్తలని ప్రస్తావించడం అవివేకం!
అసలు ఎందుకు పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు ? పుతిన్ కన్న కల ఏమిటీ ?
ఈ విషయాలు తెలియాలంటే కనీసం 200 వందల ఏళ్ళ వెనక్కి వెళ్లి చరిత్ర తెలుసుకోవాలి. 16 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం వరకు రష్యన్ సామ్రాజ్యం యూరోపు తో పాటు మంగోలియా వరకు విస్తరించి ఉంది. నిజానికి అప్పట్లో విశాల భూభాగం ఉండేది కానీ జనాభా తక్కువ. అక్కడక్కడా వివిధ జాతుల ప్రజలు నివాసం ఉండేవారు. జార్ చక్రవర్తుల కాలం నాడు ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించారు కానీ భారత్ ని కూడా స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది అప్పటి జార్ ప్రభుత్వం కానీ అప్పటికే భారత్ లో బ్రిటన్ తిష్ట వేసి ఉండడం అంత పెద్ద భూభాగం ని ఎక్కువ కాలం తమ అదుపులో ఉంచుకోవడం కష్టం అని భావించి వెనక్కి వెళ్ళిపోయారు. తరువాతి కాలంలో ప్రవాసం లో ఉన్న లెనిన్ జెర్మనీ తో లోపాయకారీగా ఒప్పందం చేసుకొని భారత్ ని బ్రిటన్ నుండి విడిపించి తమ అధీనంలోకి తీసుకోవాలనే మంతనాలు చేసాడని అంటారు. అయితే చివరి రష్యన్ జార్ చక్రవర్తిని దించేసి కమ్మ్యూనిస్తులు రష్యాని తమ అధీనలోకి తీసుకోవడం తో బిజీ అయిపోయి భారత్ గురుంచి పట్టించుకోలేదు. ఇదంతా 16 వ శతాబ్దం నుండి 1920 వరకు జరిగిన చరిత్ర.1920 తరువాత రష్యా అధీనంలో ఉన్న భూభాగం మొత్తం కలిపి USSR [Union of Soviyat Socialist Repablic ] గా ఏర్పడింది. ఇప్పటి ఉక్రెయిన్,ఉబ్జేకిస్తాన్,ఖజకిస్తాన్,బెలారస్,జార్జియా.లాత్వియా,ఎస్టోనియా,ఇలా అన్నీ సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేవి.
1954 లో అప్పటి సోవియట్ యూనియన్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అప్పటి సోవియట్ అధ్యక్షుడు లియోనిద్ కృశ్చెవ్ ఇప్పుడు ఉక్రెయిన్ లో ఉన్న క్రిమియా ద్వీప కల్పాన్ని రష్యా నుండి విడదీసి ఉక్రెయిన్ లో కలిపాడు. ఇది కేవలం అప్పట్లో పాలనా సౌలభ్యం కోసం చేసిన పని. మన దేశంలో రాష్ట్రాల విభజన జరిగినట్లుగా అన్నమాట !
ఉక్రెయిన్ లో ప్రధానంగా నాలుగు భాగాలు ఉన్నాయి.1. క్రిమియా[Crimea] 2.డాన్బాస్ [Donbas]3.ఖార్కివ్ [Kharkiv]4.ఒడెస్సా [Odessa]. వీటిలో క్రిమియా లో అధిక శాతం రష్యన్లు ఉన్నారు మొదటి నుండి ఎందుకంటే ఒకప్పుడు ఇది రష్యలో భాగంగా ఉండేది కనుక. ఈ క్రిమియాని 2014 లో రష్యా పెద్దగా ప్రతిఘటన లేకుండానే స్వాధీనం చేసుకుంది అదీ రిఫరెండం పెట్టి [అధిక శాతం వోట్లు రష్యాలో కలవాలని పడ్డాయి ]. క్రిమియా కి నల్ల సముద్ర తీరం ఉంది. ఇక డాన్ బాస్ లో రష్యాకి అనుకూలంగా ఉన్న తిరుగుబాటు దారుల చేతిలో ఉంది 2014 నుండి. వీళ్ళకి రష్యా అండదండలు ఉన్నాయి. ఇక ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతం ఖార్కివ్ [Kharkiv ] లో. ఇక నాలుగవది ఒడెస్సా రష్యా కి చాలా దూరంలో ఉంది.
అప్పటికే KGB కూడా మూత పడడంతో వ్లాదిమిర్ పుతిన్ నేరుగా రాజకీయాలలో ప్రవేశించాడు. పుతిన్ కి తమ గత తప్పులతో పాటు పశ్చిమ దేశాల కుట్ర మీద చాల కోపంగా ఉండేవాడు. క్రమంగా [అక్రమంగా కూడా ] ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి రష్యాకి అధ్యక్షుడు అయ్యాడు. క్రమంగా రష్యాని ఆర్ధికంగా,పారిశ్రామికంగా పటిష్టమయిన స్థితిలోకి తీసుకొచ్చాడు గత 20 ఏళ్ళలో. 1995 లో బుడాపెస్ట్ మెమొరాండం ప్రకారం ఉక్రెయిన్ క్రిమియా కి అటానమస్ అంటే స్వతంత్ర హోదా ని తీసేసింది. దీనికోసం రాజ్యాంగాన్ని సవరించింది ఉక్రెయిన్. 1995 లో అప్పటి ఉక్రెయిన్ పాలకులు అమెరికా, యూరోపు కీలుబొమ్మలుగా వ్యవరిహించారు. మరి మొదట ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఉక్రెయిన్ కాదా ? అదీ అమెరికా ,యూరోప్ దేశాల కోరిక మేరకే ఉక్రెయిన్ ఈ పని చేసింది. అంటే క్రిమియా కి అటానమస్ హోదా తీసేస్తే అది పూర్తిగా ఉక్రెయిన్ భూభాగం కిందకి వస్తుంది అప్పుడు నల్ల సముద్రం మీద ఉక్రెయిన్ కి పూర్తీ హక్కులు ఉంటాయి దాంతో అమెరికా ,యూరోపు దేశాలు కలిసి నల్ల సముద్రం ని బ్లాక్ చేసి రష్యా కి అడ్డంకులు సృష్టించాలి అనే పన్నాగం ఇది. ఇప్పుడు సౌత్ చైనా సముద్రం లో చైనా కృత్రిమ దీవులని కట్టి అక్కడ యుద్ధ నౌకాశ్రయం తో పాటు మిలటరీ ఎయిర్ బేస్ లని కట్టడం వెనుక ఉక్రెయిన్,క్రిమియా నల్ల సముద్రం మీద అమెరికా ,యూరోపు ఎలా అయితే ఆధిపత్యం వహించాలని చూసాయో అదే పని చైనా కూడా చేసింది. అఫ్కోర్స్ రష్యా,చైనాలు చాల ముందస్తు వ్యూహంలో భాగంగా నే ఇదంతా జరిగింది.
మరీ ముఖ్యంగా బరాక్ ఒబామా హయాంలో ఉక్రెయిన్ లో అమెరికా జోక్యం తారాస్థాయికి వెళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే 2014 లో ఉక్రెయిన్ అధ్యక్షుడు తమ దేశాన్ని నాటో లో భాగంగా చేర్చుకోండి అంటూ అధికారికంగా అభ్యర్ధించాడు అంటే ఇది ఎవరి పని అయి ఉంటుందో ఊహించవచ్చు. అంటే ఉక్రెయిన్ ని నాటో ల్ భాగంగా చేసుకొని రష్యాని బెదిరించే పని కాదా ?
డోనాల్డ్ ట్రంఫ్ అధికారంలోకి రాగానే ఉక్రెయిన్ లో అమెరికా జోక్యం లేకుండా చేశాడు. అసలు నాటో దేశాల రక్షణ బాధ్యత అమెరికా ఎందుకు తీసుకోవాలి అంటూ సంచలన ప్రకటన చేశాడు. డోనాల్డ్ ట్రంఫ్ అధికారంలో ఉన్న నాలుగేళ్ళు రష్యాతో మంచి సంబంధాలనే కొనసాగించాడు. ట్రంఫ్ కి యుద్ధం చేసి డబ్బులు ఖర్చు పెట్టడం లాంటి వాటి మీద అసలు ఇష్టం లేదు కనుకనే ప్రశాంతంగా ఉంది. అసలు జో బిడెన్ పుత్ర రత్నం ఉక్రెయిన్ లోని క్రూడ్,నాచురల్ గాస్ లలో బినామీ పెట్టుబడుల మీద సమాచారం ఇచ్చింది పుతిన్ అంటారు.
డోనాల్డ్ ట్రంఫ్ అధికారం కోల్పోగానే జో బిడెన్ అధ్యక్షుడు అయిన తరువాత అమెరికా ఆర్ధిక,సైనిక వ్యవహారాల మీద పట్టు లేకపోవడం ఒక కారణం అయితే అమెరికా తీవ్ర ఆర్ధిక సంక్షోభం లోకి వెళ్ళిపోయింది. ఇదే వ్లాదిమిర్ పుతిన్ కి మంచి సమయం అనిపించింది. అమెరికా అధ్యక్షులు మారినప్పుడల్లా ఉక్రెయిన్ లో తనకి వ్యతిరేకంగా కుట్రలు జరగడం అనేదే పుతిన్ కి నచ్చలేదు. వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ తన అదుపులో ఉంటేనే మంచిది అనుకున్నాడు దాడికి ఆదేశాలు ఇచ్చాడు.
అసలు అమెరికా ఉక్రెయిన్ మీద దృష్టి పెట్టడానికి కారణం అక్కడి ఆయిల్ నిక్షేపాలు,నాచురల్ గాస్ నిక్షేపాలు కారణం. ఇప్పుడు ఉక్రెయిన్ మీద దాడి చేసి ఆయిల్,నాచురల్ గాస్ క్షేత్రాలు తన అధీనంలో ఉంచుకొని అక్కడ తనకి అనుకూలంగా ఉండే అధ్యక్షుడిని కూర్చోపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలని ప్లాన్ ! ఎటూ దొంబాస్,ఖర్ఖీవ్,క్రిమియాలని రష్యాలో కలిపేసుకుంటాడు కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కాకపోతే యుద్ధం ఎన్ని రోజుల్లో ముగిస్తాడా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న ! ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెర్మనీ పారిపోయి అక్కడ నుండి దేశాన్ని నడిపిస్తున్నాడు ఖర్మ !
మన దేశానికి సన్ ఫ్లవర్ ఆయిల్ కి కావాల్సిన పొద్దు తిరుగుడు గింజలు 80% ఉక్రెయిన్,రష్యాల నుండి దిగుమతి అవుతాయి. కోవిడ్ వల్ల సరఫరా ఆగిపోవడం వల్ల ఇప్పటికే సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు రెండు రెట్లు పెరిగాయి ఇప్పుడు ఒక లీటర్ 300/- అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.
Courtesy :- Parthasarathy Potluri
No comments:
Post a Comment