Saturday, July 25, 2026

డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ (FAC) అధికారిపై సమగ్ర విచారణ చేపట్టాలి_

*డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ (FAC) అధికారిపై సమగ్ర విచారణ చేపట్టాలి*

*నో యువర్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్‌కు ఫిర్యాదు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 25:

నో యువర్ రైట్స్ సొసైటీ (రిజి. నెం. 177/2019) అధ్యక్షులు ఎస్. ఉమేష్ కుమార్ ఈరోజు హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) డైరెక్టర్‌ను కలిసి, ప్రస్తుతం *డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ (FAC)గా పనిచేస్తున్న శ్రీ వాపర్ల ఆనందరావు* సేవా వ్యవహారాలకు సంబంధించిన అభియోగాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
వినతిపత్రంలో అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు, న్యాయస్థానాల్లో జరిగిన న్యాయ ప్రక్రియలు మరియు ఇతర సమాచారం ఆధారంగా పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, నోషనల్ ప్రమోషన్లు, ప్రభుత్వ అనుమతి లేకుండా స్వీయ రిలీవింగ్ ఆర్డర్ జారీ చేసుకున్నారనే అభియోగాలు, అలాగే అసాధారణ సెలవు (E.O.L.) తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
అదేవిధంగా, సంబంధిత న్యాయస్థానాల్లో దాఖలైన కేసులు, ప్రభుత్వ ఉత్తర్వులు, సేవా నియమావళి మరియు శాఖ రికార్డులను పరిశీలించి, నోషనల్ ప్రమోషన్లు నిబంధనలకు అనుగుణంగా మంజూరయ్యాయా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.నో యువర్ రైట్స్ సొసైటీ అధ్యక్షులు ఎస్. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు పూర్తిగా ప్రజా ప్రయోజనం, పారదర్శకత, జవాబుదారీతనం మరియు సహజ న్యాయం (Natural Justice) సూత్రాల పరిరక్షణ కోసమే సమర్పించబడిందని తెలిపారు. వాస్తవ నిర్ధారణ అవసరమైన అంశాలన్నింటినీ వినతిపత్రంలో "అభియోగాలు" (Alleged) అనే పదంతోనే పేర్కొన్నామని, ఎవరిపైనా ముందస్తు నిర్ణయానికి రావడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.సంబంధిత అధికార యంత్రాంగం ఈ అంశంపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరిపి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నో యువర్ రైట్స్ సొసైటీ కోరింది.

No comments:

Post a Comment