*సింగరేణిని గత పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది*
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు*
*1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయం*
*కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రతినిధుల బృందం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 06:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండటం మరియు 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమవడంతో పాటు వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల కార్మికులకు కనీస వసతులు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు అని సింగరేణిని గత పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది అని సింగరేణి సంస్థ సంస్థను ఆర్ధిక నష్టాలు తీర్చడానికి తాడిచర్ల కోల్ బ్లాక్- II ను సింగరేణి సంస్థకు కేటాయించాలని బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర కేంద్ర బొగ్గుల గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈరోజు మంత్రి జి.కిషన్ రెడ్డి ని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి వాసుదేవ్, శ్రీధర్ రెడ్డి, 6 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, MLA గా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.
No comments:
Post a Comment