Monday, July 6, 2026

జర్నలిస్టులను బెదిరించి నీ అంతు చూస్తానని బెదిరించిన కాంట్రాక్టర్_

*అవినీతి అక్రమాలను ప్రశ్నించే జర్నలిస్టులకు బెదిరింపులు* 

*బెదిరింపులకు పాల్పడిన కాచిగూడ కమేల కాంట్రాక్టర్ బషీర్ హుస్సేన్  పై ఫిర్యాదు*

*కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంబర్పేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి సద్దాం హుస్సేన్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 04:

జర్నలిస్ట్ వృత్తికి ఆటంకం కలిగించిన కాచిగూడ కమేల కాంట్రాక్టర్ బషీర్ హుస్సేన్  పై ఫిర్యాదు చేసిన అంబర్పేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి సద్దాం హుస్సేన్ , ప్రవీణ్ ముదిరాజ్.కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ రాజశేఖర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్ హెచ్ ఓ రాజశేఖర్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సద్దాం చెప్పారు. ఈ సందర్భంగా సద్దాం మాట్లాడుతూ ఉదయం కమేల సమస్యలపై కమేళాకు సంబంధించిన వ్యాపారులు జర్నలిస్టులను పిలిచి తమ గోడును వినిపించారు. అదే సమయంలో కమెల కాంట్రాక్టర్ బషీర్ హుస్సేన్ నువ్వు ఎవరు వీడియోలు ఎందుకు తీస్తున్నావ్ అంటూ అడ్డుకున్నాడు అనంతరం నువ్వు ఎవరైతే నాకేంటి ఇక్కడ వీడియోలు ఫోటోలు తీయొద్దు అంటూ తీస్తే నీ అంతు చూస్తానని బెదిరించాడని తెలిపారు. అనంతరం వాట్సప్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి నీ దగ్గర ఉన్న వీడియోలన్నీ డిలీట్ చెయ్ అంటూ బెదిరింపులకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. డిలీట్ చెయ్యనియెడల నీ సంగతి చూస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదుదారుడు సద్దాం తెలిపారు.

No comments:

Post a Comment