*ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన:*
*బీజేపీ ప్రతినిధి, సంజు వర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 28:
గత ఆరు వారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆరుసార్లు ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని జాతీయ స్థాయి టీవీ చర్చలో బీజేపీ ప్రతినిధి, సంజు వర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఇందులో ఎటువంటి నిజము లేదు.తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అందించిన సమాచారం ప్రకారం, డిసెంబర్ 7, 2023 నుండి రాష్ట్రంలో నిర్వహించిన ఏ పరీక్షలోనూ ప్రశ్నపత్రం లీక్ కాలేదు.గత ఆరు వారాల్లో తెలంగాణలో ఆరుసార్లు ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందన్న ఆరోపణ పూర్తిగా వాస్తవానికి విరుద్ధం.ప్రజలు, తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి.
No comments:
Post a Comment