*తాడిచెర్ల కోల్ బ్లాక్ -2 ను సింగరేణి సంస్థకు కేటాయించిన కేంద్రం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 09:
తాడిచెర్ల కోల్ బ్లాక్-II ను ఎలాంటి బిడ్డింగ్ లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈరోజు శంషాబాద్ విమానాశ్రయంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు జెపి నడ్డా కు మరియు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి ఘనస్వాగతం పలికి సింగరేణి కి తడిచేర్ల-2 కోల్ బ్లాక్ కేటాయించి నందుకు కిషన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు దుర్గం అశోక్, కందుల సంధ్యారాణి, సునీల్ రెడ్డి, ముకేశ్ గౌడ్, అందుగుల శ్రీనివాస్, పూనమ్ చంద్ తదితరులు.
No comments:
Post a Comment