*తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB)కి ఒక వినయపూర్వక విజ్ఞప్తి*
*వి. రవికృష్ణ - సామాజిక కార్యకర్త, న్యాయవాది*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:
ఇటీవల తెలంగాణ ACB వరుసగా ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసులు నమోదు చేస్తూ, భారీ మొత్తంలో నగదు, బంగారం, వజ్రాలు, భూములు, ఫ్లాట్లు, వాహనాలు తదితర ఆస్తులను గుర్తిస్తోంది. శామీర్‌పేట్ తహసీల్దార్ కేసుతో పాటు తాజాగా మరికొన్ని DA కేసులపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.అయితే, ఆస్తులు బయటపడ్డాయనే దానితోనే దర్యాప్తు ముగియకూడదు.
*ప్రధానంగా ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనాలి:*
1. ఈ అక్రమ సంపదకు మూలం ఏమిటి?
2. లంచాలు ఇచ్చిన వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు ఎవరు?
3. ప్రభుత్వ అనుమతులు, భూ వ్యవహారాలు లేదా ఇతర అధికారిక నిర్ణయాల ద్వారా ఎవరు అక్రమ లాభాలు పొందారు?
4. బినామీ పేర్లలో ఆస్తులు కొనుగోలు చేశారా? అయితే ఆ బినామీలు ఎవరు?
లంచం తీసుకున్న అధికారిపై మాత్రమే చర్యలు తీసుకుంటే అవినీతి వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడదు. లంచం ఇచ్చినవారు, అక్రమ డబ్బు సమకూర్చినవారు, బినామీలు, సహకరించిన వారిని కూడా చట్టం ముందు నిలబెట్టినప్పుడే అవినీతికి అడ్డుకట్ట పడుతుంది.అందువల్ల ప్రతి DA కేసులో "Follow the Money Trail" సూత్రాన్ని అనుసరిస్తూ అక్రమ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి నుంచి వచ్చిందో, ఎవరెవరు లబ్ధి పొందారో సమగ్రంగా దర్యాప్తు చేసి, అందరిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ACBను వినయపూర్వకంగా కోరుతున్నాను.
అవినీతి నిర్మూలన అంటే కేవలం అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కాదు... ఆ అక్రమ సంపద వెనుక ఉన్న మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను బయటపెట్టడం.
No comments:
Post a Comment