Monday, July 6, 2026

“పండుగ సాయన్న సేవా పురస్కారాలు – 2026”

*ప్రజా వీరుడు – తెలంగాణ బందూక్ పండుగ సాయన్న జయంతి (ఆగస్టు 08) సందర్భంగా*

*“పండుగ సాయన్న సేవా పురస్కారాలు – 2026”*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 04:

ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజా వీరుడు – తెలంగాణ బందూక్ పండుగ సాయన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, ఆయన జయంతి (ఆగస్టు 08) సందర్భంగా పండుగ సాయన్న సేవా ట్రస్టు ఆధ్వర్యంలో “పండుగ సాయన్న సేవా పురస్కారాలు – 2026” ప్రదానం చేయనున్నట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సేవ, విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక రంగం, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న సేవామూర్తులను గుర్తించి, వారి సేవలను గౌరవించడం ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సేవా సంస్థలు, ఉపాధ్యాయులు, వైద్యులు, కళాకారులు, క్రీడాకారులు, పర్యావరణ కార్యకర్తలు మరియు ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
*“సేవే లక్ష్యం… సమాజమే ధ్యేయం…”* అనే నినాదంతో, పండుగ సాయన్న ఆశయాలను భావితరాలకు చేర్చడం, సేవా భావాన్ని ప్రోత్సహించడం, సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి సత్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ట్రస్టు వెల్లడించింది.
అర్హులైన వ్యక్తుల వివరాలను లేదా నామినేషన్లను పంపించాలని కోరుతూ, ఆసక్తి గల వారు క్రింది నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

*సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:*

📞 9963240519
📞 +91 80081 29303
📞 +91 85002 58662

*పండుగ సాయన్న సేవా ట్రస్టు*

“సేవను గౌరవిద్దాం… సేవామూర్తులను సత్కరిద్దాం… పండుగ సాయన్న ఆశయాలను భావితరాలకు అందిద్దాం.”

No comments:

Post a Comment