*మంత్రి దామోదర్ రాజనర్సింహ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,జులై 10:
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సి. దామోదర్ రాజనర్సింహ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పలు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానల ఏర్పాటు కోసం వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ దవాఖానల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్సలు, అవసరమైన మందులు సకాలంలో అందించడంతో పాటు ఆరోగ్య సేవలు మరింత చేరువ అవుతాయని ఎమ్మెల్యే వివరించారు.వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.
No comments:
Post a Comment