*స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది - సీఎం రేవంత్ రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15:
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శరవేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని యువత విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను నేర్చుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు.యువత తమలోని ప్రతిభను, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎదగాలని “వరల్డ్ యూత్ స్కిల్స్ డే”సందర్భంగా పేర్కొన్నారు. స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని పేర్కొన్నారు.యువత ఎప్పటికప్పుడు స్కిల్స్ అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను ఆధునిక సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆధునిక ప్రపంచంలో వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యత అందుబాటులో లేకపోవడం నిరుద్యోగానికి దారితీస్తోందని పేర్కొన్నారు."నేర్చుకోవడం ఆపొద్దు... స్కిల్స్ పెంచుకోవాలి... మీ విజయంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా మీ వంతు పాత్ర పోషించండి. నైపుణ్యమే ఆత్మవిశ్వాసానికి, ఉపాధికి, సుస్థిర భవిష్యత్తుకు మార్గం. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
No comments:
Post a Comment