*బాలల హక్కుల కార్యకర్త (Child Rights Activist) మరియు బాలల హక్కుల సంఘం వ్యవస్థాపకుడు పీ. అచ్యుతరావు 6వ వర్ధంతి*
*బాలల హక్కుల ఉద్యమకారుడిగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన అచ్యుత రావు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 21:
బాలల హక్కుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ అచ్యుత రావు గారు మనలను విడిపోయి అప్పుడే ఆరు సంవత్సరాలు అయింది. బాలల హక్కులకు ఎక్కడ ఆటంకమైన మరు నిమిషం తను వారికి అండగా ఉండేవారు,24/7 వారికి నేనున్న అనే భరోసా ఇచ్చేవారు.ఎక్కడ ఎవరికి తలొగ్గే వారు కాదు. చిన్నారులకు న్యాయం జరిగే వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త (Child Rights Activist) మరియు బాలల హక్కుల సంఘం వ్యవస్థాపకుడు పీ. అచ్యుతరావు. సుమారు 30 ఏళ్లకు పైగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన ఆయన, బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ, మరియు పిల్లలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారు.తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బాలల హక్కుల ఉల్లంఘన జరిగినా స్పందించి, పిల్లల రక్షణకు, పునరావాసానికి తన ఎన్జీవో ద్వారా ఎనలేని కృషి చేశారు.ఆయన జూలై 22, 2020న కరోనా వైరస్ (COVID-19) బారిన పడి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.అచ్యుత రావు గారి జ్ఞాపకార్థం ఈ రోజు 22 వ తేది హిమాయత్ నగర్ లోని భూలక్ష్మి గుడి దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించాము అని బాలలహక్కుల సంఘం ప్రస్తుత అధ్యక్షురాలు అనూరాధ రావు గారు తెలియచేశారు.ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో 500 కు పైగా పాల్గొన్నారు.
No comments:
Post a Comment