*రెండు సంవత్సరాల పాప ఏడస్తుంది అని వాషింగ్ మెషిన్ లో కూర్చో బెట్టిన డే కేర్ సెంటర్ సిబ్బంది*
*ఈమధ్య సోషియల్ మీడియాలో ఒక విడియో వైరల్ అవుతుంది*
*బెంగుళూరులో రెండు సంవత్సరాల చిన్న పాపపై జరిగిన అమానుష ఘటన ప్రతి తల్లి తండ్రిని కలవర పెడుతోంది*
*అనురాధ రావు అధ్యక్షురాలు - బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 04:
ఉరుకు పరుగుల ప్రపంచంలో తల్లి తండ్రి ఇద్దరు పని చేస్తేనే పిల్లలకు అన్ని సమకూర్చగలరు.పిల్లలను తప్పనిసరిగా డే కేర్ సెంటర్స్ ల్లో వదలి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, 2 సంవత్సరాల పాప ఏడస్తుంది అని వాషింగ్ మెషిన్ లో కూర్చో బెట్టారు, టాయిలెట్ జెట్ తో నీటికి నోట్లో స్ప్రే చేయడం, బాత్ రూం లో బంధించడం చేశారు. 5 గురు ఆయాలను అదుపులోకి తీసుకున్నారు వారి పై జేజేయాక్ట్ సెక్షన్ 351 క్రిమినల్,నేరపూరిత బెదిరింపు BNS ప్రకారం కేసులు నమోదు చేశారు.మన తెలుగు రాష్ట్రాలోని ఓ ఉన్న డే కేర్ సెంటర్లపై ప్రభుత్వం నిఘాఉంచుతోందా?
ఉద్యోగులు తమ పిల్లలను డే కేర్ సెంటర్స్, ప్లే స్కూల్స్ కు పంపిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్నాయా?
నగరం లో 500 ప్లే స్కూల్స్ గుర్తింపు లేకుండా నడుస్తున్నాయని ఈ మధ్య వార్తలొచ్చాయి. వీటిపై పై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఏదైనా సంఘటన జరిగేవరకు చూసి చూడనట్టు ఉంటుందా? గతంలో అనేక సంఘటనలు జరిగాయి, రెండు సంవత్సరాల పాప చపాతీ తింటుంటే గోంతులో అడ్డం పడి, పాప ఊపిరి ఆడక చనిపోయింది, ఆయా నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగింది.జీడిమెట్లలో 4 సంవత్సరాల పాప పై ఆయా అమానుషంగా దాడి చేసి, కొట్టి రోడ్డు పై వదిలేసింది,పాప ఏడుస్తూ ఉంది అని. 2025 డిసెంబర్ లో జరిగిన ఘటన ఇది.
మల్కాజిగిరి ఏరియాలో 3సంవత్సరాల బాబు ఆడుతూ తెరిచి ఉన్న సంపులో పడి చనిపోయాడు.సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగింది.
రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుడు బాబు అల్లరి చేస్తున్నాడు అని నోటికి ప్లాస్టర్ వేసి, పెన్ తో కంటి దగ్గర గుచ్చాడు,ఈ సంఘటన Aug 2025లో జరిగింది.ఇలా చెప్పుకుంటు పోతే బోలెడు సంఘటనలు ఉన్నాయి.
ప్రభుత్వం ఏం చేయాలి,పేరేంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
*తల్లితండ్రులు* - మీరు తప్పని సరిగా పిల్లలను ప్లే స్కూల్స్ కు పంపాలని అనుకుంటే,ముందు అది ప్రభుత్వ గుర్తింపు ఉందా అని చూడండి. అక్కడ వారు నడిపే సెంటర్లల్లో పని చేస్తున్న సిబ్బంది, శిక్షణ పొందిన వాళ్ళా? కాదా చెక్ చేసుకోండి.సిబ్బందిని తీసుకునేపుడు పోలిస్ వెరిఫికేషన్ చేయించారా లేదా?వారు పిల్లలను ఏవిధంగా చూస్తున్నారు గమనించాలి. నిజంగా వీరు పిల్లలను ప్రేమగా చూసుకుంటున్నారా? ప్యాషన్ తో నడిపిస్తున్నారా? లేక డబ్బుల కోసమేనా? ప్యాషన్ తో నడిపే వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, పిల్లలను ప్రేమతో చూస్తారు.సీసీటీవీ లింక్ మీ ఫోన్స్ లో వచ్చే విధంగా చూసుకోండి. అక్కడ ఏ జరిగినా మీకు తక్షణమేు తెలుస్తుంది. సీసీటీవీ పని చేయడం లేదు, లింక్ ఇవ్వం అంటే ఖచ్చితంగా వీళ్లు పిల్లలను సరిగా చూడరు అని అర్ధం. కొన్ని సెంటర్లలో పిల్లలకు దగ్గు మందు ఇచ్చి పడుకో బెడతున్నారు అనే విషయం సోషియల్ మిడియాలో నడుస్తోంది. మీ పిల్లలను ఇంటికి తీసుకు రాగానే చెక్ చేసుకోవాలి, వంటిపై గాయం కాని గుర్తులు కానీ ఉన్నాయ అని చూడాలి. పిల్లల ప్రవర్తనలో మార్పు ఎమైనా ఉందా గమనించండి. పిల్లలతో మాట్లాడండి ప్రతి రోజు, పిల్లలను ప్రేమగా అడగండి ఎలా ఉంది? ఎం చేశావు ఈ రోజు అని.ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి డే కేర్ సెంటర్ , ప్లే స్కూల్స్, తనిఖీలు నిర్వహించాలి, అనుమతి లేని వాటిని సీజ్ చేయాలి. సీసీటీవీ పర్యవేక్షణ తప్పని సరి, అక్కడ పని చేసే సిబ్బందికి పోలీస్ వెరిఫికేషను తప్పనిసరిగా ఉండాలి. శిక్షణ పొందిన సబ్బందిని తీసుకున్నారా? లేదా చెక్ చేయాలి. అనుమతులు జారి చేసేటపుడు డే కేర్ / ప్లే స్కూల్ లో సంపులు మూసి ఉన్నాయా లేదా చూడాలి. ఆడుకునే సమయం లో పిల్లలు సంపులో పడే ప్రమాదం ఉంది. ఆడుకోవడానికి ఆటస్థలం ఉందా లేదా చూడాలి.
*ఒక నిర్లక్ష్యం - చిన్నారి జీవితాన్ని మార్చేస్తుంది*.
ప్రతి చిన్నారి హక్కు సురక్షితమైన బాల్యాన్ని పొందడం. పిల్లలు భద్రత విషయంలో రాజీ పడకూడదు.చిన్నారుల హక్కులను కాపాడటం, వారికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడం మన అందరి బాధ్యత.
No comments:
Post a Comment