*30వ తేదీ సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం - సీఎం రేవంత్ రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 29:
తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీ సదస్సు హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనుంది. తొలుత మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు వేదికల నుంచి సమావేశంలో పాల్గొంటారు.
No comments:
Post a Comment