Wednesday, July 8, 2026

నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది - ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్_

*నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది - ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 08:

కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి అని ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు,  ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
*నిరంజన్ అంత్యక్రియలకు హాజరైన జనసేన నాయకులు, కార్యకర్తలు*
జనసేన అధ్యక్షులు,ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అబిమాని నిరంజన్ అంత్యక్రియలు వరంగల్ జిల్లా, హన్మకొండలో బుధవారం జరిగాయి. జనసేన నాయకులు, కార్యకర్తలు నిరంజన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, వరంగల్ కోఅర్డినేటర్ ఎం. దామోదర్ రెడ్డి ఫొన్ ద్వారా నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నాయకులు గడ్డం రాకేష్, మేరుగు శివకోటియాదవ్, గాదే పృద్వి, బర్ల శివ నిరంజన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్థానిక నాయకులు కందికొండ రామ్ చరణ్, ఎలబోయిన డేవిడ్, అజ్మీర రాజేందర్, అనుదీప్, సురేష్, అభిలాష్, దయాకర్, అంజి, శివాజీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment