*నల్లగొండ జిల్లాలో రెచ్చిపోతున్న భూ మాఫియా*
*శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామంలో పడగ విప్పిన భూ మాఫియా*
*ప్రభుత్వ భూములు,చెరువు శిఖం భూములపై అక్రమాల ఆరోపణలు... ప్రశ్నించిన సామాజిక ఉద్యమకారుడిపై దాడి!*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామంలోని ఎల్మరాజు కుంట అలుగుల ప్రాంతంలో ప్రభుత్వ భూమి, చెరువు శిఖం భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించి, అనంతరం అక్రమ పట్టాలు పొందినట్లు గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇట్టి విషయంపై గతంలో ఇప్పుడు దాడికి పాల్పడిన వ్యక్తులపై కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.మరియు కలెక్టర్ గారు ఇట్టి విషయం పై విచారణకు ఆదేశించడం కూడా జరిగింది.
*ఎల్ ఆర్ నెంబర్ (Lr.no.F1/3431/2025.తేది:-17/07/2025)*. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా రెచ్చిపోయి న భూ ఆక్రమణదారులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి రెవెన్యూ విచారణ నిర్వహించి, నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే ప్రాంతంలో ఊటుకూరు నుండి కొండారం వైపు వెళ్లే ప్రజా బాటతో పాటు రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని కూడా అడ్డుకుంటూ, ప్రభుత్వ భూమిలోని మట్టిని రైతులు తీసుకెళ్తున్న సమయంలో పనులను నిలిపివేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని వ్యక్తిగత ఆస్తిగా చూపించి ప్రజల రాకపోకలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.ఈ సందర్భంగా రైతులందరికీ ఉపయోగపడే ప్రజా బాటను మూసివేయడం సరికాదని, సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించాలని *సామాజిక ఉద్యమకారుడు వేముల శ్రీను సూచించగా, ఆయనపై దాడి జరిగి తీవ్రంగా గాయపడ్డారని ఆరోపణలు* ఉన్నాయి.ప్రభుత్వ భూములను కాపాడాలని అడిగితే దాడులా? ప్రజల హక్కుల కోసం మాట్లాడితే హత్యాయత్నమా? ఇదేనా ప్రజాస్వామ్యం?.ఈ ఘటనపై గ్రామ ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే పేరును వాడుకుంటూ ప్రజల్లో ఎమ్మెల్యేను బధనాం చేస్తూ... అతని ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న, చెప్పబడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ మరియు ఆయన సోదరుల పాత్రపై వస్తున్న ఆరోపణలను కూడా సమగ్రంగా విచారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ, ఆర్థిక లేదా ఇతర ప్రభావాలకు అతీతంగా నిజానిజాలను వెలికితీసి, ఎవరి ప్రమేయం ఉన్నా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్రామాలలో ఇలాంటి భౌతిక దాడులను ప్రోత్సహిస్తున్న భూ కబ్జాకోరులు, మాఫియా అక్రమ దారుల ను ఉపేక్షించవద్దు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు ప్రజల ఆస్తి. వాటిని ఆక్రమించే హక్కు ఎవరికీ లేదు. ప్రజా బాటలను మూసివేసే హక్కు ఎవరికీ లేదు. ప్రశ్నించే గొంతులను అణచివేసే హక్కు ఎవరికీ లేదు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా విచారణ జరిపి, ప్రభుత్వ భూముల రికార్డులను బహిర్గతం చేయాలి. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వేముల శ్రీనుపై జరిగిన దాడి ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ నిర్వహించి, దోషులను చట్టం ముందు నిలబెట్టాలి.భూ మాఫియా ఎంతటి ప్రభావశీలులైనా చట్టం కంటే గొప్పవారు కాదు. ప్రభుత్వ భూములను కాపాడటం, ప్రజల హక్కులను రక్షించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత. న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్యవాదులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తాయి.
No comments:
Post a Comment