*హైకోర్ట్ ఉత్తర్వులను గౌరవించని కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ*
*సినియర్ సిటిజన్లకు బ్రతికే అర్హత లేదా? - మాదిరెడ్డి రవిందర్ రెడ్డి(హార్ట్ పెషేంట్ )శంభునిపల్లి గ్రామం, జమ్మికుంట*
*మేము బ్రతికి ఉండగానే మా పేరిట ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయమని కుతుర్లు అల్లుళ్లు కొడుతున్నారు - సహాకరిస్తున్న స్థానిక జమ్మికుంట సి.ఐ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15
వ్యవసాయ భూములను తమపేరిట పట్టాచేయలని కూతుర్లు అల్లుళ్లు, గత 9 నెలల నుండి ఇంట్లో అక్రమంగా ఉంటు కొడుతూ చంపాలని చూస్తున్నారు అని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామం కు చెందిన మాదిరెడ్డి రవిందర్ రెడ్డి తండ్రి: తిరుపతిరెడ్డి వయస్సు 70 సంవత్సరాలు మరియు మాదిరెడ్డి సుబాషిణి భర్త: రవిందర్ రెడ్డి వయుస్సు 67 సంవత్సరాలు.మాకు ముగ్గురు కూతుళ్ళు 1) పెద్దిరెడ్డి రమాదేవి 2) గుడిపాట మౌనిక 3) చిట్టెటి స్వాతి అందరికి వివాహాలు జరిగిన్నాయి. మొదటి కూతురు హైదరాబాద్ లో , రెండవ కూతురు హన్మకొండలో నివాసముంటున్నారు. మాకు ఉండటానికి ఇల్లు లేనందున మా చిన్న కూతురు శంభునిపల్లి గ్రామం లో
కట్టుకున్న సొంత ఇంట్లో నివాసం ఉంటున్నాము.మా వృత్తి వ్యవసాయం.మాకు ఆరోగ్యం బాగాలేనందున మా వ్యవసాయ భూములు వేరేవాళ్లకి కౌలుకు ఇచ్చి వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాము. మా అన్న అయిన మాదిరెడ్డి రాజిరెడ్డి 70 సంవత్సరాల క్రితం సొంత అమ్మమ్మ అయిన వంగల మాణిక్యమ్మ గారికి దత్తత వెళ్లాడు.మా తండ్రి గారు అయిన తిరుపతి రెడ్డి 2020 సంవత్సరంలొ చనిపోగానే ఆస్తి కోసం మాకు వున్నటువంటి భూములపై మా అన్న కేసులు వేయగా అట్టి కేసు పెండింగ్లో లో ఉంది.కేసు పెండింగ్ లో ఉండగా పై చెప్పిన మా కూతుళ్లు పెద్దిరెడ్డి రమాదేవి,గుడిపాటి మౌనిక మరియు వారి భర్తలు మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మమ్మల్ని కొడుతు తిడుతూ భయబ్రాంతులకు గురిచేసి ఇంట్లో నుండి గెంటివేశారు .మాకు తినడానికి తిండిలేక, ఉండటానికి గూడులేక కట్టుకోవడానికి బట్టలు లేకుండా, వైద్యానికి డబ్బులు లేక రోడ్ల మిద జీవనం వెళ్లతీస్తున్నాము.మా ఇంట్లోకి మేము వెళ్దాం అని ప్రయత్నించగా మాపై దాడి చేశారు.ప్రతి సంవత్సరం మాకు కౌలు ద్వారా వచ్చే ఆదాయము రాకుండా అడ్డుపడి స్థానిక సి.ఐ రామక్రిష్ణ కౌలుకు చేసే వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించగా అతను కౌలుకు చేయలేదు. మేము సొంతంగా అయిన చేసుకుందాం అని భూమి మిదకు వెళ్లగా నా రెండవ కూతురు అయిన మౌనిక పైపు లైను, మోటరు, స్టాటరు, వైర్లు అన్ని పగలకొట్టి తీసుకెళ్లడం జరిగింది. ఇట్టి విషయం అయి ఆమెను అడగగా నా పై నా భార్యపై దాడికి దిగారు. ఇట్టి విషయమై స్థానిక పోలిసుస్టేషన్లో అధికారులకు దరఖాస్తు ఇవ్వగా ఎలాంటి చర్యలు తీసుకొలేదు.గత ఎనమిది నెలలుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లినా దరఖాస్తు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు.మేము ఇట్టి విషయమై రెవెన్యూ అధికారులకు వయెవృద్దుల చట్టం కింద ఆశ్రయించగా వారు మా కూతుళ్లని నెల నెల పోషణ నిమ్మిత్తం డబ్బులు ఇవ్వమని మరియు ఇంట్లోనే ఉండమని భూములు రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించకూడదని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా స్థానిక పోలిసులను ఆశ్రయించగా ఎలాంటి ఫలితం లేదు.అట్టి అర్డరు తీసుకొని మా ఇంటి వెళ్లగా మరల ఇద్దరు కుతుర్లు అల్లుళ్లు కలిసి దాడికి ప్రయత్నం చేసారు. చివరంగా గౌరవ హై కోర్టును ఆశ్రయించంగా డబ్ల్యూ పి నెం. 20003/ 2026 మాకు భద్రత కల్పించమని స్థానిక సి.ఐ కి గౌరవ హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఆ తరువాత మేము తేది 1/07/2026 నాడు స్థానిక సి.ఐ ని సంప్రదించగా మాకు భద్రత కల్పించకుండ ఎలాంటి విచారణ లేకుండా మా దరఖాస్తు మూసి వేయడం జరిగింది.ఇట్టి విషయాన్ని సిరియస్ గా తీసుకున్న న్యాయ స్థానం 09.07.2026 నాడు తిరిగి మాకు మా కూతుర్లు అల్లుళ్ల నుండి భద్రత కల్పించమని సీఐ కి ఆదేశించడం అయినది.ఈరోజు అనగా 15/07/2026 హై కోర్ట్ ఉత్తర్వులను తీసుకెళ్లి సీఐ కూ చూపించాగా అతను ఆ ఆర్డర్ కాపీ ని చూసి మా మొఖం పైన విసిరేసి బయటకు వెళ్ళండి అని గద్దరించాడు. మేము ఇచ్చిన ఆర్డర్ కాపీ ని చూసిన తరువాత రసీదు ఇవ్వమని అడుగగా ఇది పోస్ట్ ఆఫీస్ కాదు పోలీస్ స్టేషన్ అని గద్దరించాడు.గతంలో స్థానిక సి.ఐ సినియర్ సిటిజన్ లు అయిన మమ్నల్ని పొలిసు స్టేషన్ కు పిలిచి మా భూములను మా కుతుర్లకు రిజిస్ట్రేషన్ చేయమని లేకపోతే మీ మిద తప్పుడు కేసులు పెడతామని బెదిరించినాడు.ఇట్టి భూముల పై కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా మా ఇద్దరు కుతుర్లుని ప్రోత్సహించి మా తల్లిగారు అయిన మాదిరెడ్డి ఈశ్వరమ్మ భర్త: లేట్ తిరుపతి రెడ్డి వయస్సు: 85 సంవత్సరాలు తో తప్పుడు కేసు పెట్టించినాడు. మాకు అనుమతిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ని, హాంమంత్రి ని , డైరెక్టర్ జనరల్ ఆప్ పోలిసు ను కలిసి వస్తావాలతో మా గోడు విన్నవించుకుంటామని మా మనవి. మా పై గతంలో హత్యా ప్రయత్నం చేయగా మా కుతుర్లు అల్లుళ్ల పై స్థానిక పొలిసు స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ 180/2026 కేసు నమోదు చేసారు. పోలీసు వారు ముందుగానే స్పందించి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చిఉండేది కాదు. మేము బ్రతికి ఉండగానే మా పేరిట ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయమని కొడుతున్న మరియు చంపే ప్రయత్నం చేస్తున్న మా కుతుర్లు అల్లుళ్లకు సహాకరిస్తున్న స్థానిక జమ్మికుంట సి.ఐ పై చట్టరిత్యా చర్యతీసుకోగలరు అలాగే మాకు మా కూతుర్లు మరియు అల్లుళ్ళ తో మరియు స్థానిక సీఐ తో ప్రాణభయం ఉంది. కేవలం మొదట్లో సీఐ చెప్పినట్లుగా మా కూతుర్ల పేరు మీద భూములను రిజిస్ట్రేషన్ చేయనందుకు మా ఈ దుస్థితి వచ్చింది. కావున మాకు న్యాయం చేయగలరని మనవి.
No comments:
Post a Comment