Wednesday, July 29, 2026

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో "ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్" కార్యక్రమం_

*తెలంగాణ డీజీపీ కార్యాలయంలో "ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్" కార్యక్రమం*

*ఈ శిక్షణ అనంతరం పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల వస్తుందని ఆశిస్తున్నాను - సీ.వి.ఆనంద్ డిజిపి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 28:

తెలంగాణ రాష్ట్ర డిజిపి సీ.వి.ఆనంద్ జిల్లాల పర్యటనల సందర్భంగా వివిధ బడ్జెట్ హెడ్స్ లో నిధులు మంజూరు కావడం లేదని పలువురు అధికారులు డిజిపి దృష్టికి తీసుకువచ్చారు. అయితే, ప్రధాన కార్యాలయానికి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై సమగ్రంగా పరిశీలించగా, బిల్లులను ఎలా క్లెయిమ్ చేయాలి, వాటిని ఏ విధంగా అకౌంటింగ్ చేయాలి అనే ప్రక్రియపై తగిన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని తెలిసింది అని డిజిపి అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు డిజిపి కార్యాలయంలో "ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్" కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని అన్నారు. ఈ శిక్షణలో బిల్లులను ఏ విధంగా సమర్పించాలి, ఏయే గడువులను తప్పనిసరిగా పాటించాలి, అలాగే వాటిని ఎలా పరిశీలించి ధృవీకరించాలి అనే అంశాలను సవివరంగా వివరిస్తున్నారు అని తెలిపారు. ఈ శిక్షణ అనంతరం పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

No comments:

Post a Comment