*నల్లగొండ జిల్లా కలెక్టర్, కట్టంగూర్ తహసీల్దార్ లపై హై కోర్ట్ లో పిటిషన్ దాకలు చేసిన RTI &Human rights activist ఉబ్బని రాజు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 01:
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలo బోల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని SLBC కాల్వ నుండి పెరిందేవి గూడెం నర్సన్న చెరువు వరకు సర్వే నంబర్ 317,318&280 లో ఉన్న దాదాపు 110 ఎకరాల అటవీ భూమి & బంచర భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో JCB పెద్ద పెద్ద యంత్రాలతో అక్రమంగా మైనింగ్ మాఫియా చేసి మట్టిని తరలించారని RTI &Human rights activist ఉబ్బని రాజు తెలిపారు.ఈ సందర్బంగా రాజు మాట్లాడుతు మట్టిని అక్రమంగా తరలించి పర్యావరణానికి & మూగ జంతువులకు హాని తలపెట్టిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని నల్లగొండ జిల్లా కలెక్టర్ గారికి కట్టంగూర్ మండల తహసీల్దార్ గారికి పిర్యాదు చేసి 6 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు, అందుకే ఈ రోజు నల్లగొండ కలెక్టర్ మరియు కట్టంగూర్ తహసీల్దార్ గారిపై తెలంగాణ హై కోర్ట్ లో పిటిషన్ దాకలు చేసినట్టు తెలిపారు, ముఖ్యంగా పశువులకు & మూగ జంతువులకు పక్షులకు ఆవాసం లేకుండా పోయిందని అన్నారు, తక్షణమే హై కోర్ట్ జ్యూడిషల్ రిజిస్టార్ గారు స్పందించి అక్రమ మైనింగ్ మాఫియా పై పూర్తి విచారణ జరిపించి , ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు, నా పిర్యాదును పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన కలెక్టర్ మరియు తహసీల్దార్ గార్లను మందలించి వాళ్లకు ఉన్న విధులు & భాద్యతల గురించి తెలియపరచాలని నిర్లక్ష్యపు విధులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.
No comments:
Post a Comment