*ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 20:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు.రాత్రి కొడంగల్‌లో బసచేసి మరుసటి రోజు (22వ తేదీన) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
No comments:
Post a Comment