Wednesday, July 29, 2026

మత్తుపదార్థాలకు దూరంగా ఉందాం ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుందాం - మల్కాజ్గిరి పోలీస్_

*మత్తుపదార్థాలకు దూరంగా ఉందాం ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుందాం - మల్కాజ్గిరి పోలీస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 28:

రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్' (Anti-Drug Awareness Program) నిర్వహించడం జరిగింది. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు మరియు చట్టపరమైన చర్యల గురించి విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు.
యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో మనందరం భాగస్వాములం అవుదాం! అనే నినాదాలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
*ముఖ్య గమనిక*: మీ చుట్టుపక్కల ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరిగితే వెంటనే డయల్ 100 కి లేదా ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని పోలీస్ అధికారులు అన్నారు .

No comments:

Post a Comment