*ఆపరేషన్ ముస్కాన్*
*బాలకార్మికులు లేని సమాజం కోసం మనవంతు కృషి చేద్దాం*
*అనురాధ రావు అధ్యక్షురాలు - బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:
July 1st నుండి 31 వరకు దేశ వ్యాప్తంగా Operation Muskan నిర్వహిస్తారు.ఇది ప్రత్యేక లక్ష్యంతో నిర్వహించే కార్యక్రమం, తప్పిపోయిన పిల్లలను గుర్తించడం,వీరిని రక్షించి వారి కుటుంబాలకు చేర్చడం, బాలల అక్రమరవాణా, బాల కార్మికులుగా మగ్గుతున్న చిన్నారులను, బిచ్చగాళ్ల ముఠాల్లో చిక్కుకున్న చిన్నారులను,వీధి బాలలను, భిక్షాటనం చేస్తున్న చిన్నారులను రెస్క్యూ చేయడం అని అనురాధ రావు - బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అన్నారు.NCRB నివేదికల ప్రకారం భారత దేశం లో ప్రతి సంవత్సరం పదివేల పిల్లలు కనిపించకుండా పోతున్నారు, కొందరు దొరికినా, కొంతమంది పిల్లలు కనిపించడం లేదు. ప్రతి చిన్నారి వెనుక ఆ కుటుంబం ఆందోళన, బాధ, భయం ఉంటాయి. ఈ చిన్నారుల భవిష్యత్తు అంధకారం. తప్పిపోయిన చిన్నారులు - బాల కార్మికులుగా, అక్రమ రవాణా ముఠాల చేతుల్లో కొందరు, కొందరు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో,వీధుల్లో భిక్షాటనం చేస్తూ, కొందరు చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో జివీస్తుంటారు. ఇది కేవలం ఒక పోలీస్ డ్రైవ్ కాదు, పిల్లల భద్రత కోసం దేశవ్యాప్తంగా జరిగే రక్షణ కార్యక్రమం. రక్షించిన చిన్నారులను child welfare committee ద్వారా పునరావాసం కల్పిస్తారు.
2025 సంవత్సరం ఆపరేషన్ ముస్కాన్లో 7678 చిన్నారులను రెస్క్యూ చేశారు.ఎక్కువగా రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో,ఇటుక బట్టీల వద్ద, మెకానిక్ షాపుల్లో, నిర్మాణ సంస్థ వద్ద, టీ స్టాల్స్ మరియు రిలిజియస్ ప్లేసులో రెస్క్యూ చేశారు.6718 మంది చిన్నారులు బాలకార్మికులు,357 మంది చిన్నారులు వీధి బాలలు,42 మంది చిన్నారులు భిక్షాటనం చేస్తూన్న వారు.తెలంగాణకు చెందిన చిన్నారులు 3891, ఇతర 12 రాష్ట్రాలకు చెందిన పిల్లలు,నెపాల్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు.
1713 ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు,1718 మంది ఎంప్లాయర్స్/ట్రాఫికర్స్ పై కేసులు నమోదు చేశారు.మరి ఈ సంవత్సరం ఎంత మంది చిన్నారులు ఉన్నారో?
*తల్లితండ్రలకు సూచనలు ఇస్తున్నది బాలల హక్కుల సంఘం.*
1) పిల్లలకు మీ పోన్ నంబర్ గుర్తుండేలా నేర్పించండి.
2) పిల్లలను వంటరిగా వదలి పెట్టకండి.
3) జన సమూహ ప్రాంతాల్లో పిల్లలను ఒంటరిగా వదలకండి.
4 ) ఆరు బయట ఆడుతున్నారని, మీ పనుల్లో నిమగ్నం కావద్దు. వారిపై మీ దృష్టి ఉంచాలి.
5) పిల్లలు కనిపించక పోతే మీ సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి, 24 గం॥ లు వేచి చూడాల్సిన పని లేదు,
అప్రమత్తంగా ఉండాలి.
6) child line అందు బాటులో ఉంటుంది,ఎక్కడైన పిల్లలు బిక్షాటన చేస్తున్న, బాల కార్మికులుగా కనిపించిన వెంటనే 1098 కాల్ చేయండి లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో చెప్పండి.
7) రెగ్యులర్ తనీఖీలు నిర్వహిస్తే సమస్య చాల వరకు తగ్గుతుంది . ఎక్కువగా పిల్లలు ఎక్కడ పని చేస్తుంటారో,ఆ స్థావరాలు, ఆ సంస్థ వివరాలు ప్రభుత్వం వద్ద ఉంటాయి,అంటే ఇటుక బట్టీలు, కావచ్చు, construction కంపెనీలు, గాజుల ఫ్యాక్టరీలు, ఇతర ప్యాక్టరీలు. వీటిపై రెగ్యులర్గా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి, ట్రాఫికింగ్ ముఠాలను అదుపులోకి తీసుకోవాలి, బల్క్ బుకింగ్ చేస్తూన్న రైల్వే స్టేషన్లో,బస్ స్టేషన్లో సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలి. బాల కార్మికులను ఇతర రాష్ట్రాల నుండి తీసుకురావడానికి ఎక్కువగా రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తారు. చెక్ పొస్ట్ల వద్ద తనిఖీలు నిర్వహించాలి.చిన్నారులను కాపాడడం సమాజం లో ఉన్న అందరి బాధ్యత. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఇంకా ముమ్మరం చేయాలి. ఇదొక మొక్కుబడి కార్యక్రమం కాకుండ బాలకార్మికులు లేని సమాజం కోసం మనవంతు కృషి చేద్దాం.
No comments:
Post a Comment