*ప్రజల్లో ఓటర్ అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్న అడ్వకేట్ దేవరుప్పల శ్రీకాంత్*
*ఈరోజు సోమవారం అడ్వకేట్ దేవరుప్పల శ్రీకాంత్ కుమ్మర్‌వాడి, అంబర్‌పేట్ అసెంబ్లీ పరిధిలోని బూత్ నం. 26 వద్ద జరుగుతున్న S.I.R ప్రక్రియలో పాల్గొన్నారు. BLO తో కలిసి ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించారు.*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 29:
ప్రజల్లో ఓటర్ అవగాహన పెంచేందుకు మరియు ఎవరి పేరు కూడా విడిచిపోకుండా చూసేందుకు ఆయన కృషి చేస్తున్న అడ్వకేట్ దేవరుప్పల శ్రీకాంత్.ప్రజలకు శ్రీకాంత్ విజ్ఞప్తి
మీ బూత్‌లో S.I.R జరుగుతున్నప్పుడు తప్పకుండా పాల్గొనండి. మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓటు మన హక్కు - దాన్ని కాపాడుకుందాం.
S.I.R కు సంబంధించిన ఫారమ్‌లు మరియు వివరాల కోసం మీ ప్రాంత BLO ను లేదా http://www.voters.eci.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు అని ఆయన కోరడం జరిగింది.
*ఓటర్ అవగాహన - SPECIAL INTENSIVE REVISION గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది. ఓటర్ జాబితాలో పేరు సరిగ్గా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత. అందుకే ఎన్నికల సంఘం *SPECIAL INTENSIVE REVISION - S.I.R* ప్రక్రియను చేపడుతుంది.
*S.I.R లక్ష్యం:*
1. *కొత్త ఓటర్ల నమోదు* - 18 సంవత్సరాలు నిండిన యువతకు అవకాశం కల్పించడం
2. *తప్పిపోయిన పేర్లు చేర్చడం* - ఏ కారణం చేతనైనా జాబితాలో లేని వారి పేర్లు చేర్చడం
3. *తప్పుడు/డూప్లికేట్ పేర్లు తొలగించడం* - జాబితాను స్వచ్ఛంగా ఉంచడం
4. *చిరునామా మార్పులు సరిచేయడం* - ఓటర్ల వివరాలను తాజాగా ఉంచడం
ఇది పారదర్శకమైన మరియు నమ్మదగిన ఎన్నికల ప్రక్రియకు పునాది. ప్రతి కుటుంబం తమ బూత్ స్థాయిలో BLO ను కలిసి ఓటర్ జాబితాను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు
No comments:
Post a Comment