*“రండి… మన హక్కులను కాపాడుకుందాం!”*
*చేప పిల్లల పంపిణీ, కాంట్రాక్టుల పేరుతో జరుగుతున్న అవినీతిపై ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూలై 18న మత్స్య శాఖ హెడ్ ఆఫీస్ ముట్టడి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 08:
తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీ, చేప పిల్లల కాంట్రాక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దోపిడీకి నిరసనగా ముదిరాజ్ చైతన్య వేదిక – తెలంగాణ ఆధ్వర్యంలో “హలో ముదిరాజ్ – ఛలో మత్స్య శాఖ ముట్టడి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమం 2026 జూలై 18వ తేదీ (శనివారం) ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్‌లోని మత్స్య శాఖ హెడ్ ఆఫీస్ వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు.రాష్ట్రంలోని సంప్రదాయ మత్స్యకారుల హక్కులను కాలరాస్తూ, చేప పిల్లల పంపిణీ, కాంట్రాక్టుల ప్రక్రియలో అవినీతి, మధ్యవర్తుల పెత్తనం, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే విధానాలను నిలిపివేసి, పారదర్శకంగా చేప పిల్లల పంపిణీ చేపట్టాలని కోరారు.ఈ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్రంలోని ముదిరాజ్, గంగపుత్ర, బెస్త, వడబలిజ, అగ్నికుల క్షత్రియ తదితర సంప్రదాయ మత్స్యకార సంఘాల నాయకులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ముదిరాజ్ చైతన్య వేదిక పిలుపునిచ్చింది.
*కార్యక్రమం వివరాలు:*
* కార్యక్రమం: హలో ముదిరాజ్ – ఛలో మత్స్య శాఖ ముట్టడి
* తేదీ: 18-07-2026 (శనివారం)
* సమయం: ఉదయం 11:00 గంటలకు
* వేదిక: మత్స్య శాఖ హెడ్ ఆఫీస్, హైదరాబాద్
* ఆయోజకులు: ముదిరాజ్ చైతన్య వేదిక – తెలంగాణ
*సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9963240519*
No comments:
Post a Comment