Wednesday, July 1, 2026

_మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది_

*మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది.*

*అభివృద్ధి–మానవీయత రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతాం - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 29:

ఈ రోజు డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ కు అవసరమైన భూ సేకరణ, పునరావాసం తదితర అంశాలపై రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఎండీ ఈ.వి. నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో సమీక్షించడం జరిగింది.హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసి నదిని పునరుజ్జీవింపజేసి, దాన్ని పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మార్చాలన్నది గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక నదీ అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పర్యావరణహితమైన జీవన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ సంకల్పం.మూసి నది కాలుష్యంతో ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వరదల సమయంలో పరివాహక ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వాక్‌వేలు, వినోద కేంద్రాలు ఏర్పాటు ద్వారా మూసి పరివాహక ప్రాంతాలను సరికొత్త జీవన కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసినట్టుగా మూసి ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకంగా కాని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ కోణంలోనే తీసుకుంటాం.ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో భూ సేకరణ ప్రక్రియలో ప్రజా కోణంలో ఆలోచించి మాన‌వీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని అధికారులకు సూచించడం జరిగింది.ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాల‌ని ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచరణ రూపొందించి త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని అధికారులను ఆదేశించడం జరిగింది.భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో రాజీ పడొద్దని అధికారులకు సూచిచడం జరిగింది.

No comments:

Post a Comment