రేషన్ కార్డుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభ వార్త చెప్పింది.
రేషన్ కార్డు లో ఏవైనా మార్పులు అంటే.. పేర్లను తొలగించడం లేదా పేర్లను జతపరచడం లాంటి వాటి పై కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.రేషన్ కార్డు కలిగి ఉండి కుటుంబ సభ్యులందరి పేర్లు రేషన్ కార్డులో లేకుంటే, అనగా కొత్తగా వివాహం అయినవారు వారి భార్య పేరు కాని, ఇటీవల పుట్టిన చిన్న పిల్లల పేర్లు కాని రేషన్ కార్డులో నమోదు చేసుకునే (ఎక్కించుకునే)అవకాశం వచ్చింది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
కావలసిన ధ్రువపత్రాలు:-
1. పాత లేదా కొత్త రేషన్ కార్డ్ నంబర్.
2. రేషన్ కార్డులో నమోదు చేసుకునే వారి ఆధార్ కార్డు.
3. గ్యాస్ కనెక్షన్ బుక్
నమోదు చేసుకోవాలనుకున్న వారు మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోగలరని తెలంగాణ సర్కార్ పేర్కొంది.
No comments:
Post a Comment