Thursday, June 23, 2022

ఇదిగో సిరిసిల్ల వ్యవసాయ కళాశాల

ఇదిగో సిరిసిల్ల
వ్యవసాయ కళాశాల..

త్వరలోనే సీఎం కేసీఆర్
చేతుల మీదుగా ప్రారంభం

సిరిసిల్ల సిగలో మరో మణిహారం చేరుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లెల్ల శివారులో ఆధునిక వ్యవసాయ కళాశాల నిర్మితమైంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అత్యాధునిక హంగులు.. సకల వసతులతో రూపుదిద్దుకున్నది. 69.30 కోట్ల వ్యయంతో 18 ఎకరాల్లో కళాశాల భవనం, బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు, మరో 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా కేంద్రం. ఫాంలాండ్ను సర్కారు నిర్మించింది. అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్లు, ప్రయోగశాల,
సెమినార్ రూములు, అధ్యాపకుల గదులు, అసోసియేట్ డీన్ చాంబర్, ఆధునిక
లైబ్రరీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఇది రెండోది కాగా,
త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల
మీదుగా ప్రారంభోత్సవం కానుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము
• హైదరాబాద్ తర్వాత రెండోది ఇక్కడే
• మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లెల్లలో అగ్రికల్చర్ కాలేజీ
• 16 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో భవన సముదాయం
• మరో 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం
ప్రారంభోత్సవానికి సిద్ధం
• విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం.

.link Media ప్రజల పక్షం 

No comments:

Post a Comment