Tuesday, June 21, 2022

సమాజం ఎన్నటికీ మరువని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్

ప్రొఫసర్ సారూ మిమ్మల్ని యాదిమరిచేట్టు చేస్తున్న దొర..... కానీ మీరు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ వుంటారు 🎉🙏...... Bplkm🪶 prajasankalpam1.blogspot.com 


*సమాజం ఎన్నటికీ మరువని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్* 

*తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ 11వ వర్ధంతి వేడుకలు*

తెలంగాణ సింద్దాంత కర్త, తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ 11వ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆయన విగ్రహానికి ఉద్యమ కారుల ఆధ్వర్యంలో పూలమాలకు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1952 నుంచి తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని తెలంగాణ సమాజంలో అవగాహన కల్పించడంతోపాటు మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ పక్షాలన్నింటినీ ఒప్పించడంలో కీలక భూమిక వహించిన ప్రొఫెసర్ జయశంకర్ ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువ లేదని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇద్రీస్, జెడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్,   సీనియర్ ఉద్యమ నేత రాజా వరప్రసాద్ రావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉద్యమ నాయకులు వంగూరు గంగిరెడ్డి మరియు నక్కల వెంకటేష్ గౌడ్,విద్యార్థి ఉద్యమనేతలు జాంగారి రవి, లక్ష్మణ్ నాయక్, మామిడిపల్లి శరత్, రాఘవేందర్, జూపల్లి శంకర్, మలినేని సాంబశివ రావు, బాలయ్య, మల్లయ్య యాదవ్, దిలీప్ కుమార్, ఇప్పల పల్లి సురేష్,  తదితరులు పాల్గొన్నారు.

link Media ప్రజల పక్షం 

No comments:

Post a Comment