Monday, June 13, 2022

రౌడీలు......కేడీలపై ఉక్కుపాదం..పి ఎస్ ల వారీగా లెక్క తేల్చుతున్న సీపీ స్టీఫెన్‌రవీంద్ర

*రౌడీలు......కేడీలపై ఉక్కుపాదం*

*పీఎ్‌సల వారీగా లెక్క తేల్చుతున్న సీపీ స్టీఫెన్‌రవీంద్ర*

హైదరాబాద్‌ రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై దృష్టి పెంచాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశించారు.కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో అల్లరిమూకల ఆగడాలు, రౌడీషీటర్‌ల అరాచకాలు, భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఎస్‌హెచ్‌ఓలు, ఏసీపీలు, డీసీపీలు, క్రైమ్‌ సిబ్బందితో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు.

501 మంది రౌడీషీటర్స్‌

మూడేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం.. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ప్రస్తుతం రౌడీషీటర్ల సంఖ్య 501గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరిపై దృష్టి పెట్టాలని సీపీ సూచించినట్లు సమాచారం.

పాత నేరస్థులకు కౌన్సెలింగ్‌

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టం చేశారు. ఇటీవల కమిషనరేట్‌ పరిధిలోని కొంతమంది పాత నేరస్థులతో సమావేశం నిర్వహించి హెచ్చరించారు. ఇకపై ప్రతి నేరస్థుడి జాబితా రికార్డుల్లో ఉంటుందని, పదే పదే అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్న వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు పాత నేరస్తులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇప్పటికే పాత నేరస్థుల అడ్ర్‌సలు, లొకేషన్స్‌ను జియోట్యాగింగ్‌ చేయగా.. కొత్తవారిని కూడా జియోట్యాగింగ్‌ చేసి, వారి కదలికలపై నజర్‌ పెడుతున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో నేరస్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment