Saturday, June 18, 2022

16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై జులై 1 నుంచి నిషేధం!

*16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై జులై 1 నుంచి నిషేధం!*

దిల్లీ: ఒకసారి వాడిపారేసే 16 రకాల ప్లాస్టిక్‌ వస్తువులను జులై 1 నుంచి నిషేధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇయర్‌బడ్స్‌, బుడగలు, క్యాండీ, ఐస్‌క్రీంల కోసం వాడే ప్లాస్టిక్‌ పుల్లలు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్‌ స్వీట్‌బాక్సులు, ఆహ్వానపత్రాలు, సిగరెట్‌ ప్యాకెట్లు, 100 మైక్రాన్‌లలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే పాలిస్ట్రైరిన్‌ (థర్మోకోల్‌) వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది. పెట్రోకెమికల్‌ సంస్థలేవీ ప్లాస్టిక్‌ ముడిసరకును ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీచేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏ వాణిజ్య సంస్థా తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ఉపయోగించరాదని షరతు విధిస్తూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీచేయాలని, ఒకవేళ ఎవరైనా ఉపయోగించినా, లేదంటే నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించినా వాటి లైసెన్సులు రద్దుచేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment