Thursday, June 16, 2022

పిల్లలను బడికి పంపండయ్యో....ఎండలో నేలపై పడుకోని హెడ్ మాస్టర్ వేడుకోలు

*పిల్లలను బడికి పంపండయ్యో....ఎండలో నేలపై పడుకోని హెడ్ మాస్టర్ వేడుకోలు*

పుల్‌కల్‌, : బడి మానేసిన పిల్లలను బడికి పంపేవరకూ తిరిగి వెళ్లేదేలేదంటూ వాళ్ల ఇళ్ల వద్ద ప్రధానోపాధ్యాయుడు నేలపై పడుకొని వినూత్న నిరసన తెలుపుతూ తల్లిదండ్రులను వేడుకున్నారు.సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండలం ముదిమాణిక్యం గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ముదిమాణిక్యం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నూలి శ్రీధర్‌రావు సహచర ఉపాధ్యాయులను వెంట బెట్టుకుని బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి పూర్తి చేసిన అన్నదమ్ములు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో చేరాల్సి ఉంది. అయితే అందులో ఒకరు బాల కార్మికుడిగా మారగా, మరొకరు అనారోగ్యంతో పాఠశాలలో చేరలేదు. వీరితో పాటుగా ఏడో తరగతి పూర్తి చేసుకుని ఎనిమిదో తరగతిలో చేరాల్సిన మరో విద్యార్థి కూడా బడి మానేశాడు. దీంతో హెచ్‌ఎం శ్రీధర్‌రావు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడికి వచ్చేలా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రులు ఎంతకీ వినకపోవడంతో.. ఎండలో కటిక నేలపై కూర్చుని, పడుకుని వినూత్న రీతిలో వారిని వేడుకొన్నారు. చివరకు పిల్లలను తిరిగి పాఠశాలకు వచ్చేలా చేశారు. దీంతో హెచ్‌ఎం శ్రీధర్‌రావును గ్రామస్థులు ప్రశంసించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment