*పట్టువీడని విద్యార్ధులు.... బాసరలో 6 వ రోజు కొనసాగుతున్న నిరసన....!*
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అటు విద్యార్థులు పట్టువీడటం లేదు... విద్యార్థులు ప్రతిపాదించిన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన పూర్తి స్థాయిలో రావడం లేదు.ఫలితంగా ఆరో రోజు కూడా బాసరలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.
ఐఐటీ ప్రధాన ద్వారం వద్ద దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మెయిన్ గేటు వద్దకు ఎవర్నీ వెళ్లనీయకుండా పోలీసులు రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. గత ఆరు రోజులుగా బాసరలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 12 డిమాండ్లతో ఈనెల 14 నుంచి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బాసర ట్రిపుల్ ఐటీకీ 2 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మద్దతుగా ఇవాళ సాయత్రం నిజామాబాద్ నుంచి ఏబీవీపీ కార్యకర్తలు బాసర చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసుల ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం స్వచ్ఛందంగా ఇంటికి వెళ్లే విద్యార్థులకు అనధికారికంగా అనుమతిస్తోంది. ఆరు సంవత్సరాల ట్రిపుల్ ఐటీ కోర్సులో పీయూసీ-1, పీయూసీ-2 చదువుతున్న విద్యార్థులను కుటుంబ సభ్యలకు సమాచారం ఇవ్వకుండా, వారు వెంటలేకుండా వెళ్లేందుకు అనుమతించకూడదనే నిబంధన ఉంది. కానీ, ఆరు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో నిబంధనలను యాజమాన్యం అనధికారికంగా సడలించింది.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment