Sunday, June 19, 2022

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కీలక నిర్ణయం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కీలక నిర్ణయం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. తమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో విద్యార్థులు తుది సమరానికి సిద్దమయ్యారు. దీంతో 24 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. ఓవైపు వర్షం వర్షం కురుస్తున్నా.. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ప్రతిపాదించిన 12 డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రంతా బయటే ఉండి తమ నిరసనను తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత ఐదు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైకరిపై ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు రాత్రంతా నిరసన దీక్ష చేయాలని నిర్ణయించామని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.

2017 లోనూ తాము నిరసన చేసినా అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని స్టూడెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపస్ కు ఒకసారి వచ్చి తమ సమస్యలను పరిశీలించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ముఖ్యంగా తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించని కేసీఆర్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థులు నేరుగా సీఏం కేసీఆర్‌ గానీ మంత్రి కేటీఆర్‌ గానీ వచ్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల నిరసన దీక్షకు పిలుపు నిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు.

No comments:

Post a Comment