టీఆర్ఎస్ అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు
– చర్యలు తీసుకోవాలన్న జడ్సన్
ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాలేనంటూ విపక్షాలు తరచూ విమర్శలు గుప్పిస్తుంటాయి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని.. ప్రాజెక్టుల పేరుతో విపరీతంగా దోపిడీకి పాల్పడ్డారని మండిపడుతుంటాయి. కేసీఆర్ కుటుంబ ఆస్తులు వేల కోట్లకు పెరిగాయని ఆరోపిస్తుంటాయి. తాజాగా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల అమలులో అక్రమాలు అనేకంగా జరుగుతున్నాయనేది జడ్సన్ ఆరోపణ. కబ్జాలు, సెటిల్ మెంట్లు, బెదిరింపులతో అక్రమాలతో వేలకోట్లు సంపాదించి.. ప్రజలను ఆగం చేశారని విరుచుకుపడుతున్నారాయన. ఈ నేపథ్యంలోనే జడ్సన్ గవర్నర్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది.
కల్వకుంట్ల పాలనలో అంతా అవినీతిమయం అంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు జడ్సన్. కేసీఆర్ కుటుంబం చేసిన అక్రమాలు, అవినీతిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ మాజీ స్పెషల్ ప్లీడర్ అడ్వకేట్ శరత్ కుమార్ తో కలిసి జడ్సన్ ఫిర్యాదు చేశారు.
No comments:
Post a Comment