Tuesday, June 28, 2022

తెలంగాణ ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలదే.... హవా

*తెలంగాణ ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలదే.... హవా*

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 5,90,327 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, రెండో సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు
*ఇంటర్‌ మొదటి సంవత్సరం..*
❃ పరీక్షకు హాజరైన విద్యార్థులు: 4,64,892

❃ ఉత్తీర్ణత సాధించినవారు: 2,94,378

❃ ఉత్తీర్ణత శాతం: 63.32 శాతం

❃ పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 2,33,210

❃ ఉత్తీర్ణత సాధించినవారు: 1,68,692

❃ ఉత్తీర్ణత శాతం: 72.33

❃ పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 2,31,682

❃ ఉత్తీర్ణత సాధించినవారు: 1,25,686

❃ ఉత్తీర్ణత శాతం: 54.20 శాతం

ఇంటర్‌ రెండో సంవత్సరం..

❉ పరీక్షకు హాజరైన విద్యార్థులు: 4,63,370

❉ ఉత్తీర్ణత సాధించినవారు: 2,95,949

❉ ఉత్తీర్ణత శాతం: 67.82 శాతం

❉ పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 2,16,389

❉ ఉత్తీర్ణత సాధించినవారు: 1,64,172

❉ ఉత్తీర్ణత శాతం: 75.86

❉ పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 2,19,981

❉ ఉత్తీర్ణత సాధించినవారు: 1,31,777

❉ ఉత్తీర్ణత శాతం: 60 శాతం

ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆగస్టు చివరినాటికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటర్‌ మొదటి ఏడాది ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా (76 శాతం), హనుమకొండ జిల్లా (74 శాతం) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. రెండో ఏడాది ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా (78 శాతం) మొదటి స్థానంలో ఉండగా, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా (77శాతం) రెండో స్థానం దక్కించుకుంది.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment