Monday, June 20, 2022

విద్యాశాఖ లోని అవినీతి అధికారులు & ఉపాధ్యాయులు మీద యుద్ధం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ

*పత్రికా ప్రకటన*

*భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ*

విషయం:- ZPHS హెడ్మాస్టర్ సిహెచ్ సాంబయ్య,MPPS హెడ్మాస్టర్ స్వరూపరాణి, రామంతపూర్ ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేస్తున్న హెడ్మాస్టర్ ల సస్పెండ్ చెయ్యాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. 

*అదనపు కలెక్టర్ ఏనుగుల నరసింహారెడ్డి గారికి*, విద్యాధికారి DEO గారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

 ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్* మాట్లాడుతూ.....ZPHS హెడ్మాస్టర్ సిహెచ్ సాంబయ్య,  MPPS హెడ్మాస్టర్ స్వరూపరాణి, *రామంతపూర్ ప్రభుత్వ పాఠశాలలో*  విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేస్తున్న హెడ్మాస్టర్ ల పైన చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్. నూతనంగా అడ్మిషన్ అవుతున్న విద్యార్థినీ విద్యార్థులు దగ్గర నుండి తెలుగు మీడియం చదివే విద్యార్థుల అడ్మిషన్ ఫీజు 1000 నుండి 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులకు 5000 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. టీసీ, బోనఫైడ్ 500 రూపాయలు ఇస్తేనే ఇస్తామనే కండిషన్ అయినా విధానం కాదు, యూనిఫామ్ టై బెల్టు కూడా డబ్బులు కట్టాలి. ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో డబ్బులు కట్ట లేకనే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ అవుతున్న స్టూడెంట్ లకు కూడా డబ్బులు వసూలు చేయడంతో అడ్మిషన్ కాకుండా గందరగోళంలో పడ్డారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా డబ్బులు కట్టాలా అనే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే డబ్బులు కడితేనే అడ్మిషన్ అవ్వండి లేకపోతే అవ్వకండి అని చెప్పేసి హెడ్మాస్టరు హెచ్చరికలు విడుదల చేయడం ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలహీన విద్యార్థులకు చదువు చెప్పవలసిన హెడ్మాస్టర్ ని ఈ విధంగా లంచాలకు పాల్పడితే పై అధికారులు ఏం చేస్తున్నట్లుగా అన్ని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. హెడ్మాస్టర్ లను వెంటనే సస్పెండ్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పై అధికారులకు తెలియజేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక కష్టనష్టాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అండగా ఉండి నాణ్యమైన చదువు అందించాలి కానీ ఈ రకంగా లంచాలు ఇస్తేనే చదువు చెబుదామనే హెచ్చరికలు ప్రభుత్వ ఉపాధ్యాయులు చేయడం తీవ్రంగా ఖండిస్తోంది. హెడ్మాస్టర్లను సస్పెండ్ చేసే అంత వరకు రాబోయే రోజుల్లో పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఎం ఉప్పల్ జోన్ కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్, *ప్రజాసంకల్పం బాపట్ల కృష్ణమోహన*, ఎస్ఎఫ్ఐ ఉప్పల్ మండల కార్యదర్శి మణికంఠ, ఎస్ఎఫ్ఐ నాయకులు M.శివ, బల్లెం గౌతం, సాయి కిరణ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

------------------------------------------------------------
*Video -1*                 https://youtu.be/zCM76PmuBFs          *Video -2*    https://youtu.be/AUAe5EFSgi4      *తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు మీరేమో మనబడి అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలి అని అధికారులకు ఆదేశాలు ఇస్తే వారేమో మీ ఆదేశాలను పాటిస్తలేరు దానితో కొందరు HM లు & ఉపాధ్యాయులు అవినీతికి అలవాటు పడి విద్యావ్యవస్థను బ్రష్టుపట్టిస్తున్నారు. ఈ అంశం మీద మేడ్చల్ జిల్లా SFI నాయకులు రాథోడ్ సంతోష్ (జిల్లా కార్యదర్శి)ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేసి మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ గారికి & DEO మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.... Bplkm🪶*  NOTE : *పూర్తి వివరాలు* prajasankalpam1.blogspot.com లో   *Copy to Group link Media*  20/06/2022

No comments:

Post a Comment