*ఉద్యోగమా.... న్యాయ వృత్తా.....*
*ఆరు నెలల్లో తేల్చుకోవాలి: సుప్రీం*
దిల్లీ: ఇతర ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులూ బార్ కౌన్సిల్‌లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు.అయితే వారు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్(ఏఐబీఈ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత ఆరు నెలల్లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతారా లేదా ఇతర ఉద్యోగంలోనే ఉంటారో నిర్ణయించుకోవాలి. ఇతర వృత్తులు చేస్తున్న వారు కూడా న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేయొచ్చంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం కోర్టు గురువారం పేర్కొంది.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment