*తెలంగాణ వాసులకు కూల్ న్యూస్.... మరో 4 రోజులు వర్షాలు....!*
వేసవికాలం తాపంతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. భానుడి ప్రతాపానికి వేసవికాలం ప్రారంభం నుంచి ఎండతీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు చెమటలు కక్కుతున్నారు.
ఉదయం 9 నుంచే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలపై వరుణుడు నిన్న కరుణించి వర్షం కురిపించడంతో ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించింది. అయితే ఈ రోజుల కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఆకాశమంతా మేఘావృతమై ఉంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కర్నాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఈ నెల 25 వరకు దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment